Additional SP Mahender | ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు : అదనపు ఎస్పీ మహేందర్
Additional SP Mahender | పోలింగ్ రోజున ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు.
నర్సాపూర్ : పోలింగ్ రోజున ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ( Additional SP Mahender) సూచించారు. శుక్రవారం నర్సాపూర్( Narsapur ) మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతో పాటు బీవీఆర్పీటీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ , కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ చేపట్టిన మౌలిక వసతులు, భద్రత ఏర్పాట్లు, సిబ్బంది ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా పరిశీలన చేపట్టానని వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల భద్రత ఏర్పాట్లపై నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 100 మీటర్ల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. డబ్బు, మధ్యం బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం చట్టవిరుద్దమని హెచ్చరిస్తూ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ చెక్‌పోస్టును పరిశీలించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

