అమరావతి : తిరుమల లడ్డూ ( Tirumala Laddu ) లో జంతువుల కొవ్వు కలువలేదని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ఇచ్చిన చార్జ్‌షీట్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan) స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ( Supreme Court ) కంటే చంద్రబాబు పదవి గొప్పది కాదని వ్యాఖ్యనించారు. అయితే చంద్రబాబు స్వార్థంతో వేసుకుంటున్న ఏకసభ్య కమిషన్‌తో ఎటువంటి ఫలితం ఉండదని అన్నారు.
ఇటీవల టీడీపీ శ్రేణుల దాడులతో దహనానికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని, సందర్శించి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూపై చంద్రబాబు ఎన్ని రకాలుగా అవాస్తవాలను ప్రచారం చేసిన చులకన కావడం ఖాయమని అన్నారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని బాబుకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
టీటీడీ ప్రక్షాళన కాకముందే ఈవో శ్యామలరావును ఎందుకు తొలగించారని తెలిపారు. పాపం చేసింది ఎవరో తేల్చలని, ఆ భగవంతుడు చంద్రబాబు బుద్ధి, జ్ఞానం రావాలని కోరుకుంటున్నానని అన్నారు. జోగి రమేష్ ఇంటిపై యాసిడ్, పెట్రోల్ బాటిళ్లతో పోలీసులు, టీడీపీ గూండాలు కమ్ముక్కై విధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్న వారిని తాము అధికారంలోకి వచ్చిన తరువాత బోన్లో నిలబెడుతామని , వారందరికి శిక్ష పడుతుందని తెలిపారు.