IND vs ENG | లార్డ్స్ వన్డేలో డకెట్ రికార్డు శతకం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
IND vs ENG : లార్డ్స్ వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(141) రెచ్చిపోయాడు. భారత బౌలర్లకు దడపుట్టించిన డకెట్ భారీ శతకంతో కదం తొక్కగా.. కుర్ర ఓపెనర్ జాబ్ బెథెల్(91) అర్ధ శతకంతో చెలరేగాడు.
IND vs ENG : లార్డ్స్ వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(141) రెచ్చిపోయాడు. భారత బౌలర్లకు దడపుట్టించిన డకెట్ భారీ శతకంతో కదం తొక్కగా.. కుర్ర ఓపెనర్ జాబ్ బెథెల్(91) అర్ధ శతకంతో చెలరేగాడు. వీరిద్దరు 192 రన్స్‌తో పటిష్టమైన పునాది వేయగా.. గత మ్యాచ్ హీరో జో రూట్(74 నాటౌట్) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ పిచ్‌పై టాపార్డర్ మెరుపులకు జోస్ బట్లర్(41 నాటౌట్) తుఫాన్ బ్యాటింగ్ తోడవ్వగా ఆతిథ్య జట్టు స్కోర్ 350 దాటేసింది. ఇదే వేదికపై 14 ఏళ్ల క్రితం నాట్‌వెస్ట్ ఫైనల్లో మూడొందల పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా.. పట్టుదలగా ఆడితేనే సిరీస్ సొంతమవ్వనుంది.
లార్డ్స్‌లో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు దంచేశారు. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలోని భారత పేస్ దళాన్ని దీటుగా ఎదుర్కొన్న బెన్ డకెట్ (141), జాకబ్ బెథెల్ (91)లు వికెట్ కాచుకొని శుభారంభమిచ్చారు. ఫలితంగా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 58 రన్స్ చేసిన ఆతిథ్య జట్టు
స్కోర్‌బోర్డు ఆపై ఊపందుకుంది.
క్రీజులో పాతకుపోయిన ఈ జోడీని విడదీసేందుకు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలర్లను మార్చినా లాభం లేకపోగా.. ఇద్దరూ అర్ధ శతకాలతో కదం తొక్కారు. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయాన్ని ఎట్టకేలకు ప్రసిధ్ కృష్ణ(2-69) విడదీసి ఊపిరి పీల్చుకోనిచ్చాడు.
Success for England’s new ODI opening duo, Ben Duckett and Jacob Bethell 💪 pic.twitter.com/xMKB0qGhjy
— Cricinfo (@cricinfo) July 19, 2026
నాలుగో శతకం
బెథెల్ ఔటైనా తగ్గని డకెట్.. గుర్నూర్ ఓవర్లో రెండు బౌండరీలతో వన్డేల్లో నాలుగో శతకం అందుకున్నాడు. అదే ఉపులో లార్డ్స్‌లో అత్యధిక స్కోర్‌తో వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్(Clive Lloyd) రికార్డు బద్ధలుకొట్టిన డకెట్.. ఎట్టకేలకు ప్రిన్స్ యాదవ్ ఓవర్లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు శతక భాగస్వామ్యం నమోదు చేసిన జో రూట్ అనంతరం గేర్ మార్చి అర్ధ శతకం సాధించాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్(14) విఫలమైనా రూట్ (74 నాటౌట్)జతగా జోస్ బట్లర్(41 నాటౌట్) సిక్సర్ల మోత మోగించాడు. వీరిద్దరు చివరిదాకా నిలబడడంతో నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ 3వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది.
Ben Duckett walks off with the highest individual men’s ODI score at Lord’s, overtaking Viv Richards 🌟 pic.twitter.com/VpR1YEFPbK
— Cricinfo (@cricinfo) July 19, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

