హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశాలను మీరెప్పుడైనా చూశారా..?
Tourist spots near Hyderabad: ఒకప్పుడు హైదరాబాదీలు వారం మొత్తం బాధ్యతలు, ఉద్యోగాలతో బిజీబిజీగా గడిపి.. వారాంతపు సెలవు నాడు మాత్రం ఇండ్లకే పరిమితమయ్యేవారు. హాయిగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఎంజాయ్‌గా గడిపేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

హైదరాబాద్: ఒకప్పుడు హైదరాబాదీలు వారం మొత్తం బాధ్యతలు, ఉద్యోగాలతో బిజీబిజీగా గడిపి.. వారాంతపు సెలవు నాడు మాత్రం ఇండ్లకే పరిమితమయ్యేవారు. హాయిగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఎంజాయ్‌గా గడిపేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీకెండ్ వచ్చిందంటే చాలు టూర్ ప్లాన్ చేస్తున్నారు. చూడదగ్గ ప్రదేశాల కోసం వెతుకుతున్నారు. ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాని ప్రదేశాల గురించి కూడా అన్వేషించి వారాంతంలో అక్కడ వాలిపోతున్నారు. ఇలా వారంతపు టూర్ల ద్వారా తదుపరి వారం కోసం మనసును, శరీరాన్ని రీచార్జ్ చేసుకుంటున్నారు. ఈ విధంగా వారాంతపు టూర్లు ప్లాన్ చేసేవారికి హైదరాబాద్ చుట్టుపక్కల మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..?
1. లోయర్ మానేరు డ్యామ్
ఈ డ్యామ్‌ను కరీంనగర్ జిల్లా అలుగనూరు గ్రామంలో మానేరు నదికి అడ్డంగా నిర్మించారు. ఈ డ్యామ్ హైదరాబాద్ మహానగరానికి కేవలం 162 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది. మానేరు నది గోదావరి నదికి ఉపనది. మానేరుపై నిర్మించిన ఈ డ్యామ్ పర్యాటకులకు కావాల్సినంత కనువిందు చేస్తుంది. సాయంత్రం వేళల్లో మానేరు నదీ తీరంలో గడిపే నగరవాసులను ప్రకృతి అందాలు పరవశింపజేస్తాయి. పైగా రిజర్వాయర్‌లో బోటింగ్‌కు వెళ్లేవారికి చల్లని పిల్లగాలి గిలిగింతలు పెడుతుంది.

2. ఈగలపెంట
స్నేహితులతోగానీ, కుటుంబసభ్యులతోగానీ వీకెండ్ స్పెండ్ చేయడానికి ఈగలపెంట ఒక చక్కని టూరిస్ట్ ప్లేస్. హైదరాబాద్ నగరానికి 190 కిలోమీటర్ల దూరంలో ఈ ఈగలపెంట ఉన్నది. శ్రీశైలం వెళ్లే దారిలో నల్లమల అడవుల్లో ఉంటుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం ఇది. ఈగలపెంటకు వెళ్లేదారిలోని పచ్చని అడవులను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఇక ఈగలపెంటలోని హరిత రెసార్ట్స్ నుంచి ముగ్ద మనోహరమైన ప్రకృతి అందాలను వీక్షించడం మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. ఈ ప్రాంతంలో ప్రధానమైన పర్యాటక ఆకర్షణ ఇదే. అంతేగాక ఈ టూర్‌కు వెళ్లినవారు ఫర్హాబాద్లోని జంగిల్ సఫారీ, మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్, ఆక్టోపస్ వ్యూ పాయింట్‌ను అస్సలు మిస్ కావొద్దు.
3. కొంగల జలపాతం

ఈ కొంగల జలపాతం హైదరాబాద్ నగరానికి 275 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్నది. వరంగల్ నగరం నుంచి అక్కడికి రెండు గంటల ప్రయాణం. వారమంతా విధులు నిర్వహించడంతో కలిగిన విసుగును పారదోలి పునరుత్తేజం నింపడానికి ఈ కొంగల జలపాతం ఒక చక్కని పర్యాటక ప్రాంతం. రహదారికి ఇరువైపుల పచ్చని అడవితో ప్రకృతి రమణీయత పర్యాటకులను పులకరింపజేస్తుంది. స్వచ్ఛమైన పచ్చని చెట్ల నడుమ అత్యంత స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చుకోవచ్చు. దట్టమైన పచ్చని చెట్లతో నిండిన ఎత్తయిన కొండల నుంచి జాలువారే ఈ కొంగల జలపాతం తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశం.
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

