ఆదివారం 01 నవంబర్ 2020
International - Sep 20, 2020 , 03:34:38

కొబ్బరి చెట్టెక్కిన మంత్రి

కొబ్బరి చెట్టెక్కిన మంత్రి

కొలంబో: తాను చెప్పాలనుకున్న విషయం ప్రజలకు బాగా అర్థం కావాలనుకున్నారో.. ఏమోగానీ.. రైతులకు సందేశం ఇవ్వడానికి శ్రీలంక మంత్రి అరుందిక ఫెర్నాండో ఏకంగా కొబ్బరి చెట్టు ఎక్కారు. దేశంలో 70 కోట్ల కొబ్బరికాయల కొరత ఉన్నదని, దీన్ని పూడ్చడానికి ఖాళీ స్థలాల్లో రైతులు కొబ్బరి సాగు చేయాలని చెట్టు పైనుంచే ఫెర్నాండో ప్రసంగించారు. అనుచరుల సాయంతో చేతుల్లో కొబ్బరిబొండం పట్టుకొనిమరీ చెట్టుపై నుంచి ప్రసంగించారు.