e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home Telangana నాగార్జునసాగ‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల లైవ్‌ అప్‌డేట్స్‌

నాగార్జునసాగ‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల లైవ్‌ అప్‌డేట్స్‌

పోస్టల్‌ బ్యాలెట్స్‌లో టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం

పోస్టల్‌ బ్యాలెట్స్‌లోనూ టీఆర్‌ఎస్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తం 1384 పోస్టల్‌ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌కు 822 ఓట్లు, కాంగ్రెస్‌కు 428 ఓట్లు, బీజేపీకి 30 ఓట్లు, టీడీపీకి 6 ఓట్లు వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌ లీడ్‌ 394 ఓట్లు.

టీఆర్‌ఎస్‌కు 18,449 ఓట్ల ఆధిక్యం

25వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 18,449 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 25వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 2443, కాంగ్రెస్‌కు 2408 ఓట్లు వచ్చాయి. 25వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్‌ 35 ఓట్లు.

విజయానికి చేరువగా టీఆర్‌ఎస్‌

24వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 18,414 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 24 వ రౌండ్ లో టీఆర్ఎ‌స్ కు 3312 ఓట్లు. కాంగ్రెస్ కు 2512 ఓట్లు వచ్చాయి. 24 వ రౌండ్ లో టీఆర్‌ఎస్ లీడ్ 800 ఓట్లు.

టీఆర్‌ఎస్‌కు 17,614 ఓట్ల ఆధిక్యం

23వ రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 17,614 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 23వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ కంటే 849 ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

22వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం

22వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 16765 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 22వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ కు 3783 ఓట్లు. కాంగ్రెస్ కు 2540 ఓట్లు వచ్చాయి. 22వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1243.

టీఆర్‌ఎస్‌కు 15,522 ఓట్ల ఆధిక్యం

21 వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 15,522 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 21 వ రౌండ్ లో టీఆర్ఎ‌స్ కు 3463 ఓట్లు. కాంగ్రెస్ కు 3011 ఓట్లు వచ్చాయి. 21 వ రౌండ్ లో టీఆర్‌ఎస్ లీడ్ 452 ఓట్లు.

20వ రౌండ్‌లోనూ కొన‌సాగిన టీఆర్ఎస్ ఆధిక్యం

మొత్తం 25 రౌండ్ల‌కు గానూ 20 రౌండ్ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. 20వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 1080 ఓట్ల ఆధిక్యం చేకూరింది. మొత్తం మీద 20వ రౌండ్ కౌంటింగ్ ముగిసేస‌రికి అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 15,556 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. ఇంకా ఐదు రౌండ్ల ఫ‌లితాలు వెలువ‌డాల్సి ఉంది.

భారీ ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌.. రెండో స్థానంలో కాంగ్రెస్‌

19వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 14476 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 19వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3732. కాంగ్రెస్ కు 2652 ఓట్లు వచ్చాయి. 18వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ కంటే 1080 ఓట్లు ఎక్కువ వచ్చాయి.

దూకుడు పెంచిన టీఆర్‌ఎస్‌

18వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 13396 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 4074.. కాంగ్రెస్ కు 2259 ఓట్లు వచ్చాయి. 18వ రౌండ్లో కాంగ్రెస్‌ కంటే టీఆర్‌ఎస్‌కు 1851 ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

టీఆర్‌ఎస్‌కు 11581 ఓట్ల ఆధిక్యం

17వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 11581 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 17వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌కు 3772, కాంగ్రెస్ కు 2349 ఓట్లు వచ్చాయి.

16వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం

16వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్‌ 10158 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రౌండ్ లో టీఆర్‌ఎస్‌కు 3475, కాంగ్రెస్కు 3231 ఓట్లు వచ్చాయి.

టీఆర్‌ఎస్‌కు 9914 ఓట్ల ఆధిక్యం

15వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 9914 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3203 ఓట్లు, కాంగ్రెస్ కు 2787 ఓట్లు వచ్చాయి.

14వ రౌండ్లో కాంగ్రెస్ లీడ్

14వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ మొత్తం 9498 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 14వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ కు 2734, కాంగ్రెస్ కు 3817 ఓట్లు వచ్చాయి. 14వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌కంటే కాంగ్రెస్కు 1083 ఓట్లు ఎక్కువ వచ్చాయి.

టీఆర్‌ఎస్‌కు 10581 ఓట్ల ఆధిక్యం

13వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 10581 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 13వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌కు 3766, కాంగ్రెస్ కు 3546 ఓట్లు పోలయ్యాయి. 13వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ లీడ్ 220.

12వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ 1255 ఓట్ల ఆధిక్యం

12వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 10361 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 12వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ కు 3833, కాంగ్రెస్ కు 2578 ఓట్లు వచ్చాయి. 12వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ 1255 ఓట్ల లీడ్‌లో ఉంది.

టీఆర్‌ఎస్‌కు 9106 ఓట్ల ఆధిక్యం

11వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 9106 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 11వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ కు 3395, కాంగ్రెస్ కు 2225 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో టీఆర్‌ఎస్‌కు 1170 ఓట్లు వచ్చాయి.

పదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం

10వ రౌండ్ ముగిసే సరికి టీఆరెఎస్‌ 7936 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. పదో రౌండ్ లో టీఆర్‌ఎస్‌ఎస్ 2991, కాంగ్రెస్ కు 3166 ఓట్లు వచ్చాయి. 10వ రౌండ్ లో కాంగ్రెస్కు 175 ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

9వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది. కారు దూకుడుకు విప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్‌లోనూ గులాబీ గుభాళిస్తోంది. ప్ర‌తి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ భారీగా మెజార్టీగా దిశ‌గా దూసుకెళ్తుండ‌టంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నారు.. వ‌రుస‌గా తొలి తొమ్మిది రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. తొమ్మిదో రౌండ్ ముగిసే స‌రికి 8,111 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. తొమ్మిదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,205, కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నికల అధికారులు ప్ర‌క‌టించారు.

సాగ‌ర్‌లో నోముల భ‌గ‌త్ ఆధిక్యం

 టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నారు.. వ‌రుస‌గా తొలి ఎనిమిది రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. ఎనిమిదో రౌండ్ ముగిసే స‌రికి 7,948 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. ఎనిమిది రౌండ్లో టీఆర్ఎస్‌కు 3, 249, కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నికల అధికారులు ప్ర‌క‌టించారు.

6,592 ఓట్ల ఆధిక్యంలో నోముల భ‌గ‌త్

టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ వ‌రుస‌గా తొలి ఏడు రౌండ్ల‌లోనూ మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. ఏడో రౌండ్ ముగిసే స‌రికి 6,592 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి.  తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి.

4 వేల ఓట్ల మెజార్టీతో భ‌గ‌త్ ముందంజ‌

 వ‌రుస‌గా తొలి ఐదు రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. ఐదో రౌండ్ ముగిసే స‌రికి 4,334 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు.  ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్‌కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోల‌య్యాయి.

4వ‌ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ జోరు

నాలుగో రౌండ్ ముగిసే స‌రికి 3,457 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి. నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వ‌చ్చాయి.

సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితం.. 3వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ దూకుడు

సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితం.. రెండో రౌండ్‌లోనూ భ‌గ‌త్ ముందంజ‌

సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితం.. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు ఆధిక్యం

సాగర్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాగార్జునసాగ‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల లైవ్‌ అప్‌డేట్స్‌

ట్రెండింగ్‌

Advertisement