Shubhanshu Shukla |భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష ప్రయాణం ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాన్షు బృందం ఇవాళ క్షేమంగా భూమికి చేరుకుంది. వీరు ప్రయాణిస్తున్న స్పేస్‌క్రాఫ్ట్ ఇవాళ మధ్యాహ్నం 3:01 గంటల సమయంలో అమెరికా కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యింది. అనంతరం అక్కడే ఉన్న సిబ్బంది వారి వద్దకు చేరుకొని నౌకలోకి తీసుకొచ్చారు. కొన్ని నిమిషాల వ్యవధిలో వ్యోమగాములు ఒక్కొక్కరు అభివాదం చేసుకుంటూ అవనిపై అడుగుపెట్టారు.
Splashdown of Dragon confirmed – welcome back to Earth, @AstroPeggy, Shux, @astro_slawosz, and Tibi!
— SpaceX (@SpaceX) July 15, 2025
ఏడు రోజులు క్వారంటైన్..
వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత ఏడు రోజులపాటూ క్వారంటైన్‌కు (rehabilitation) తరలించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని వెల్లడించింది.
శుభాన్షు రికార్డు..
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లాతోపాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే. తిరుగు ప్రయాణం నేపథ్యంలో ఆదివారం అంతరిక్ష కేంద్రంలో ఫేర్వెల్ సెర్మనీ జరిపారు.
Dragon’s four main parachutes have deployed pic.twitter.com/oGfRfqCymB
— SpaceX (@SpaceX) July 15, 2025
Also Read..
Shubhanshu Shukla: అంతరిక్షంలో హెయిర్ కటింగ్ చేయించుకున్న శుభాన్షు శుక్లా
Kanwar Yatra: హోటళ్లకు క్యూఆర్ కోడ్ ఆదేశాలు.. యూపీకి సుప్రీంకోర్టు సమన్లు
SpiceJet | కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ప్రయాణికులు.. స్పైస్‌జెట్ విమానంలో గందరగోళం