న్యూఢిల్లీ: ఉత్తరాదిలో శివభక్తులు కన్వరీ యాత్ర(Kanwar Yatra) చేపడుతున్నారు. అయితే ఆ యాత్ర సాగే మార్గంలో ఏర్పాటు చేసిన హోటళ్లు అన్నీ క్యూఆర్ కోడ్లు ప్రదర్శించాలని యూపీ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్యూఆర్ కోడ్ ద్వారా ఆ హోటల్ యజమానుల పేర్లు, ఐడెంటీ తెలుస్తుందని యూపీ సర్కారు ఆ ఆదేశం ఇచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. క్యూఆర్ కోడ్ ఆదేశాలను ప్రశ్నిస్తూ.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని సుప్రీం తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆ రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. ఎంఎం సుంద్రేశ్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అకాడమీషియన్ అపూర్వానంద్ జా దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణనను జూలై 22వ తేదీకి వాయిదా వేసింది.