Donald Trump | పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్ (Kamala Harris)కు టేలర్ స్విఫ్ట్ (Taylor Swift) మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను కమలాకే ఓటు వేస్తానని వెల్లడించారు.
అయితే, టేలర్ ప్రకటనను ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టేలర్ కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘నేను టేలర్ అభిమానిని కాదు. ఆమె ఎప్పుడూ డెమోక్రాట్లనే సమర్థిస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకు ఆమె భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఎన్నికల్లో తాను కమలా హారిస్‌కే మద్దతు ఇస్తానని టేలర్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, టిమ్ వాజ్‌కు ఓటు వేస్తాను. దేశ ప్రజల హక్కుల కోసం కమలా పోరాడుతున్నారు. మన హక్కులు మనకు కావాలంటే ఒక వారియర్ అవసరమని భావిస్తున్నాను. గందరగోళంతో కాకుండా ప్రశాంతంగా దేశం కోసం ఏదైనా సాధించొచ్చని నమ్ముతున్నాను. అందుకే నేను కమలా హారిస్‌కే మద్దతు ఇస్తున్నాను. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని తన సోషల్ మీడియా పోస్టులో టేలర్ వెల్లడించారు.
Also Read..
Kamala Harris | ట్రంప్‌పై కమలదే పైచేయి.. హారిస్ ఇయర్ రింగ్స్‌లో సీక్రెట్ డివైస్!
Adani Group | అదానీ.. గో బ్యాక్.. మోదీ ఆప్తమిత్రుడిపై కెన్యాలో పెద్ద ఎత్తున నిరసనలు
Palastine supporters | మెల్బోర్న్లో పాలస్తీనా మద్దతుదారుల నిరసన.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు