Explosion | కొత్త ఏడాది వేళ స్విట్జర్లాండ్ (Switzerland)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లగ్జరీ ఆల్పైన్ స్కీ రిసార్ట్ పట్టణం (luxury Alpine ski resort town) క్రాన్స్ మోంటానా (Crans Montana)లోని ఒక బార్లో పేలుడు (Explosion) సంభవించింది.
ఈ పేలుడులో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్విస్ పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడినట్లు పేర్కొంది. లే కాన్ట్సెలేషన్ అనే బార్లో గురువారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్నదానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
🇨🇭⚡ Several people were ki!!ed and others injured after an explosion tore through a bar in the luxury Alpine ski resort of Crans-Montana, Swiss police say.
A cantonal police spokesperson told AFP that the blast was of unknown origin while confirming multiple fatalities. pic.twitter.com/GGbEOvvKrk
— Osint World (@OsiOsint1) January 1, 2026
Also Read..
New Year 2026 | కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన ప్రపంచ దేశాలు.. వీడియోలు చూశారా..?
Nitish Kumar | రూ.1.48 కోట్ల ఫ్లాట్, రూ.20,552 నగదు.. ఆస్తి వివరాలు ప్రకటించిన బీహార్ సీఎం
Snow Fall | కశ్మీర్ వ్యాలీపై విపరీతంగా మంచు.. గడ్డ కట్టే చలిలోనూ గస్తీ కాస్తున్న సైనికులు.. VIDEOS