Snow Fall | ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తున్నది (Snow Fall). దీంతో సాధారణ జన జీవనం స్తంభించింది. ముఖ్యంగా కశ్మీర్ వ్యాలీ (Kashmir Valley)లో విపరీతంగా మంచు పడుతోంది. ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. దాంతో కశ్మీర్ వ్యాలీ పరిసరాలన్నీ అందంగా, ఆహ్లాదకరంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి.
#WATCH | Jammu & Kashmir: Higher reaches of the Kashmir Valley, including the popular tourist spot Sonamarg, covered under a thick blanket of snow
(Visuals from Sonamarg) pic.twitter.com/iWhdrrSILz
— ANI (@ANI) January 1, 2026
ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన సోనమార్గ్ (Sonamarg), గుల్మార్గ్, లఢక్, శ్రీనగర్ సహా ఉత్తర, దక్షిణ కశ్మీర్లో ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలు శ్వేతవర్ణంతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లు, రహదారులు, చెట్లను మంచు కమ్మేసింది. నిరంతరాయంగా కురుస్తున్న మంచు వర్షాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తుండగా.. స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా శ్రీనగర్-లఢక్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్‌లపై విపరీతంగా మంచు పేరుకుపోవడంతో.. పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ తెగిపోయింది.
#WATCH | Poonch, J&K: Romeo Force of the Indian Army intensified search operations in the Pir Panjal Ranges of Poonch above 13,000 feet, despite heavy snowfall and tough terrains. pic.twitter.com/0iGwuZg34W
— ANI (@ANI) January 1, 2026
మరోవైపు తీవ్రమైన మంచు పరిస్థితుల్లోనూ సైన్యం పహారా కాస్తోంది. 13 వేల అడుగుల ఎత్తున్న మంచుకొండలపై చలిని సైతం లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం ఆపరేషన్ నిర్వహిస్తోంది. అతిశీతల వాతావరణ పరిస్థితులను సైతం తట్టకుంటూ గస్తీ కాస్తోంది. గడ్డ కట్టే చలిలోనూ దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు మన సైనికులు.
#WATCH | Poonch, J&K: Romeo Force of the Indian Army intensified search operations in the Pir Panjal Ranges of Poonch above 13,000 feet, despite heavy snowfall and tough terrains. pic.twitter.com/qfCN2hZYHn
— ANI (@ANI) January 1, 2026
Also Read..
PM Modi | అద్భుతమైన సంవత్సరం కావాలి.. దేశ ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
New Year 2026 | కొత్త ఏడాది.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. VIDEOS
Adult videos | అడల్ట్ వీడియోల కోసం భారతీయుల భారీ ఖర్చు