PM Modi | మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. కొత్త ఆశలతో ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘2026 ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది మీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని.. మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. సమాజం శాంతి, ఆనందంతో (Peace And Happiness) ఉండాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. ప్రధానితోపాటూ పలువురు ప్రముఖులు కూడా దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Also Read..
New Year 2026 | కొత్త ఏడాది.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. VIDEOS
మా వల్లే భారత్, పాక్ మధ్య శాంతి చైనా మంత్రి ప్రకటన
West Bengal | చనిపోయాడనుకున్న వ్యక్తి ‘సర్’తో బతికొచ్చాడు!