Israel: ఏకధాటిగా రాకెట్ల వర్షం కురిపిస్తున్న హమాస్.. బోర్డర్ వద్ద ఉగ్రవాదుల్ని తరిమికొడుతున్న ఇజ్రాయిల్
Israel: రాకెట్ల వర్షం కురిపిస్తోంది హమాస్. దక్షిణ ఇజ్రాయిల్ వైపు నుంచి అటాక్ చేసింది. దీంతో బోర్డర్ పట్టణాల్లో భయానక వాతావరణం నెలకొన్నది. హమాస్ దాడికి కౌంటర్ ఇస్తోంది ఇజ్రాయిల్. ఐడీఎఫ్ దళాలు ఆ టెర్రర్ గ్రూపును నిలువరిస్తున్నాయి. దాదాపు 5 వేల రాకెట్లతో హమాస్ దాడి చేసినట్లు తెలుస్తోంది.
గాజా: గాజా నుంచి ఇజ్రాయిల్(Israel) దిశగా డజన్ల సంఖ్యలో రాకెట్లను ఫైర్ చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. రాకెట్ల దాడితో అప్రమత్తమైన దక్షిణ ఇజ్రాయిల్‌లో సైరన్లు మోగాయి. టెల్ అవివ్ ప్రాంతంలో కూడా అలర్ట్ ప్రకటించారు. పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపు హమాస్ ఆ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
అషేక్లాన్ నగరంలో చెలరేగిన మంటల్ని ఆర్పేందుకు ఇజ్రాయిల్ ఫైర్‌ఫైటర్లు రంగంలోకి దిగారు. కాలిపోయిన వాహనాల నుంచి భారీ స్థాయిలో నల్లటి పొగ చిమ్ముతోంది. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్లోకి భారీగా ఉగ్రవాదులు చొరబడినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ దళాలు పేర్కొన్నాయి. స్థానికులు ఇండ్ల వదిలి బయటకు రావొద్దు అని ఐడీఎఫ్ ప్రకటన చేసింది.
దక్షిణ ప్రాంత నగరమైన సీడెరట్లో హమాస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయల్ దేశంలోకి ఎంత మంది ఉగ్రవాదులు చొరబడ్డారో ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం హమాస్, ఐడీఎఫ్ మధ్య భీకర పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
దాదాపు రెండు గంటల నుంచి ఏకధాటికి హమాస్ ఉగ్రవాదులు రాకెట్లు ఫైర్ చేస్తున్నట్లు ఇజ్రాయల్ తెలిపింది. దీంతో జెరుసలాం, బీర్షీబా, టెల్ అవివ్ నగరాల్లో సైరన్లు మోగించారు. దాదాపు 5 వేల రాకెట్లతో హమాస్ దాడి చేసినట్లు తెలుస్తోంది.
Hamas terrorists seen clashing with Israeli forces in southern Israel. pic.twitter.com/uJWd07xpVO
— Emanuel (Mannie) Fabian (@manniefabian) October 7, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Gaza strip
- Hamas
- IDF
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

