Rishi Sunak | భారత్ అధ్యక్షతన దేశ రాజధాని న్యూ ఢిల్లీలో శనివారం ప్రారంభమైన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) ఆదివారంతో ముగిసింది. ఈ సమావేశంలో అమెరికా సహా వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, జీ20 శిఖరాగ్ర సదస్సులో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak ) అందరి దృష్టిని ఆకర్షించారు.
సదస్సుకు హాజరైన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ( Sheikh Hasina)తో రిషి కాసేపు మాట్లాడారు. ఆ సమయంలో షేక్ హసీనా కుర్చీలో కూర్చొని ఉండగా.. రిషి మాత్రం మోకాళ్లపై కూర్చొని ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. ఇద్దరు దేశాధినేతలు స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు రిషిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఓ దేశానికి ప్రధాని అయిన రిషి సునాక్.. మరో దేశ ప్రధానితో ఎంతో ఆప్యాయంగా మోకాళ్లపై కూర్చొని మాట్లాడుతున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, జీ20 శిఖరాగ్ర సమావేశాలకు రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తి (Akshata Murty)తో కలిసి శుక్రవారం భారత్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రిషి దంపతులు ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని (Akshardham Temple) సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ప్రధాని మోదీతో కూడా రిషి భేటీ అయ్యారు.
भारत में #G20 के सफल आयोजन की चर्चा दुनियां भर में है।
कार्यक्रम के दौरान कुछ ऐसी तस्वीरें सामने आई जिसे लोगों ने खूब पसंद किया।
इसी में से एक है ब्रिटिश PM ऋषि सुनक की तस्वीर, जिसमें वे बांग्लादेश की PM शेख हसीना से घुटने के बल बैठकर बात कर रहे हैं।#RishiSunak #G20India pic.twitter.com/0KXtO2h0T2
— Bikram Kumar Sinha (@bikramksinha) September 11, 2023
Also Read..
Justin Trudeau | కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. రాత్రంతా ఢిల్లీలోనే బస చేసిన ట్రూడో
Jasprit Bumrah | తండ్రయిన బుమ్రాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పాకిస్థాన్ స్టార్ పేసర్.. వీడియో వైరల్