Jasprit Bumrah | తండ్రయిన బుమ్రాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పాకిస్థాన్ స్టార్ పేసర్.. వీడియో వైరల్
Jasprit Bumrah | టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తండ్రి అయిన విషయం తెలిసిందే. బుమ్రా సతీమణి, యాంకర్ సంజనా గణేశన్ (Sanjana Ganeshan) గత సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే బుమ్రా (Jasprit Bumrah) తండ్రి అవ్వడం పట్ల పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది (Shaheen Afridi) శుభాకాంక్షలు తెలిపాడు.
Jasprit Bumrah | టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తండ్రి అయిన విషయం తెలిసిందే. బుమ్రా సతీమణి, యాంకర్ సంజనా గణేశన్ (Sanjana Ganeshan) గత సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే బుమ్రా (Jasprit Bumrah) తండ్రి అవ్వడం పట్ల పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది (Shaheen Afridi) శుభాకాంక్షలు తెలిపాడు. ఆసియాకప్ (Asia Cup) సూపర్-4లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ (Ind Vs Pak) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ భారీ వర్షం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇక నేడు రిజర్వ్ డే కావడంతో ఆట ఎక్కడ ఆగిందో తిరిగి అక్కడి నుంచే ప్రారంభం కానుంది. అయితే ఆదివారం మ్యాచ్ ఆగిన అనంతరం జస్ప్రీత్ బుమ్రా దగ్గరకు పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది వచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. తండ్రి అయినందుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.
”ముబారక్ బుమ్రా.. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా చూడాలి. మరో కొత్త బుమ్రాను తయారు చేయండి అని షాహిన్ అఫ్రిది తెలిపాడు. అనంతరం ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తు.. మంచి స్ఫూర్తి చూపిన షహిన్ను ప్రశంసిస్తున్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Spreading joy 🙌
Shaheen Afridi delivers smiles to new dad Jasprit Bumrah 👶🏼🎁#PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/Nx04tdegjX
— Pakistan Cricket (@TheRealPCB) September 10, 2023
జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేషన్ గత సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ పిల్లాడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

