Justin Trudeau | కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. రాత్రంతా ఢిల్లీలోనే బస చేసిన ట్రూడో
Justin Trudeau | జీ20 సదస్సు (G20 Summit) కోసం భారత్‌కు విచ్చేసిన కెనడా ప్రధాన మంత్రి (Canadian Prime Minister) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తిరుగు ప్రయాణం వాయిదా పడింది.
Justin Trudeau | జీ20 సదస్సు (G20 Summit) కోసం భారత్‌కు విచ్చేసిన కెనడా ప్రధాన మంత్రి (Canadian Prime Minister) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తిరుగు ప్రయాణం వాయిదా పడింది. సమ్మిట్ కోసం ట్రూడో శుక్రవారం భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సదస్సు ముగిసిన తర్వాత ఢిల్లీ నుంచి కెనడా బయలుదేరాల్సి ఉంది. అయితే, ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన సిబ్బంది చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేశారు.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు ట్రూడో ఆయన బృందం న్యూఢిల్లీ నుంచి కెనడా బయలుదేరాలి. తాజా పరిణామంతో వారంతా ఆదివారం రాత్రి కూడా భారత్‌లోనే బస చేయాల్సి వచ్చింది. సమస్య పరిష్కారం అయిన తర్వాత సోమవారం కెనడా ప్రధాని తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Cinema news | సారీ.. ఆ సిరీస్ చేయలేనంటున్న మెగా కోడలు.. కారణం ఆదేనా?
BRI Project | చైనాకు షాకిచ్చిన ఇటలీ.. బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రకటన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

