Cinema news | సారీ.. ఆ సిరీస్ చేయలేనంటున్న మెగా కోడలు.. కారణం ఆదేనా?
మెగా కోడలు అనేది చాలా బరువైన బాధ్యత. ఏం చేసినా అభిమానులను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇంతకు ముందులా ఉంటే కుదరదు.
Lavanya Tripathi | మెగా కోడలు అనేది చాలా బరువైన బాధ్యత. ఏం చేసినా అభిమానులను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇంతకు ముందులా ఉంటే కుదరదు. లావణ్యాత్రిపాఠి (Lavanya Tripathi) ఈ విషయంలో ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తున్నారు. వరుణ్‌తేజ్, లావణ్యల నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆమె సినిమాలు కూడా తగ్గించుకున్నారు. ప్రస్తుతం తమిళ్లో ఓ సినిమా మినహా ఆమె చేతిలో సినిమాల్లేవు. అయితే కొన్ని నెలల క్రితం కథ నచ్చటంతో ఆమె ఓ వెబ్ సిరీస్‌కి ఓకే చెప్పారు. ‘స్కైలాబ్’ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వక్ ఖండేరావ్ దర్శకుడు.
కథ రీత్యా ఇందులో కథానాయిక పాత్ర కాస్తంత బోల్డ్‌గా ఉంటుందని తెలిసింది. పైగా ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుందట. అందుకే ఆ వెబ్‌సిరీస్ దర్శక, నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్ని చూసుకోమని చెప్పేశారట లావణ్య. నిశ్చితార్థం అయిన తర్వాత ఇక నేను కొణిదలవారి కోడల్ని. ఇలాంటి కథల్లో నటించడం సబబుకాదని వారికి చెప్పి పంపించేశారట. ఈ విషయం తెలిసిన వారంతా లావణ్య నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

