Novak Djokovic | యూఎస్ ఓపెన్-2023 విజేత జకోవిచ్.. 24వ గ్రాండ్ స్లామ్‌ను ముద్దాడిన సెర్బియన్ స్టార్
Novak Djokovic | సెర్బియన్ టెన్నిస్ స్టార్ (Serbian Tennis Star) నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఓపెన్ -2023 (US Open -2023) మెన్స్ సింగిల్ విజేతగా నిలిచాడు.
Novak Djokovic | సెర్బియన్ టెన్నిస్ స్టార్ (Serbian Tennis Star) నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఓపెన్ -2023 (US Open -2023) మెన్స్ సింగిల్ విజేతగా నిలిచాడు. దీంతో కెరీర్లో 24వ గ్రాండ్ స్లామ్ (24th Grand Slam) టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో రష్యా ఆటగాడు మెద్వెదెవ్ (Medvedev )ను చిత్తుచేసి 24వ గ్రాండ్ స్లామ్‌ను ముద్దాడాడు.
2021 నాటి యుఎస్ ఓపెన్‌లో మెద్వెదెవ్ చేతిలో పరాజయం పాలైన జకోవిచ్ ఈసారి టోర్నమెంట్లో అతడిపై పూర్తి ఆధిపత్యం కనబర్చాడు. ఫైనల్ పోరులో 6-3, 7-6, 6-3 తేడాతో వరుస సెట్లలో మూడో సీడ్ ఆటగాడు మెద్వెదెవ్‌ను చిత్తుచేసిన జకోవిచ్ 24వ గ్రాండ్ స్లామ్‌ను ఎగరేసుకుపోయాడు. అంతేకాదు, టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (24) ను సమం చేశాడు.
Also Read..
Justin Trudeau | కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. రాత్రంతా ఢిల్లీలోనే బస చేసిన ట్రూడో
Cinema news | సారీ.. ఆ సిరీస్ చేయలేనంటున్న మెగా కోడలు.. కారణం ఆదేనా?
NH 44 | ఎన్‌హెచ్ 44పై వ్యానును ఢీకొట్టిన డీసీఎం.. ఏడుగురు మహిళలు దుర్మరణం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

