Ishaq Dar | భారత్ (India)తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా (Ready For Dialogue With India) ఉన్నట్లు దాయాది పాకిస్థాన్ మరోసారి ప్రకటించింది. కశ్మీర్ సహా అన్ని సమస్యల పరిష్కారానికి న్యూ ఢిల్లీతో గౌరవప్రదమైన చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి (Pak Foreign Minister), ఉప ప్రధాని ఇషాక్ దార్ (Ishaq Dar) మాట్లాడుతూ.. ‘జమ్ము కశ్మీర్ వివాదం సహా అన్ని సమస్యల పరిష్కారానికి భారత్‌తో గౌరవప్రదమైన రీతిలో చర్చలు జరిపేందుకు పాక్ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.
కాగా, పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తోక ముడిచిన పాక్.. అనేక సార్లు కాళ్ల బేరానికి వచ్చింది. న్యూ ఢిల్లీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తోంది. అయితే, భారత్ మాత్రం పాక్ అభ్యర్థనను తిరస్కరిస్తూ వస్తోంది. ఉగ్రవాదం, చర్చలు రెండూ ఏకకాలంలో ఉండవని వెల్లడించింది. ఆ దేశంతో చర్చలు జరిగితే కేవలం ఉగ్రవాదం, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)పైనే ఉంటాయని స్పష్టం చేస్తోంది.
Also Read..
Cloudburst | జమ్ము కశ్మీర్లో క్లౌడ్‌బరస్ట్.. 11 మంది మృతి
PM Modi | బుల్లెట్ రైల్లో ప్రయాణించిన ప్రధాని మోదీ.. VIDEO