PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జపాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ బుల్లెట్ రైలు (Bullet Train)లో ప్రయాణించారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా (Shigeru Ishiba)తో కలిసి టోక్యో నుంచి సెందాయ్ (Tokyo To Sendai) నగరానికి వెళ్లారు. ఈ జర్నీని ప్రధాని ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు వైరల్ అవుతున్నాయి.
Japan PM Shigeru Ishiba tweets, “With Prime Minister Modi to Sendai…” pic.twitter.com/k9xljgOeV5
— ANI (@ANI) August 30, 2025
కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఏఐ, సెమీకండక్టర్లు, పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్- జపాన్ 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. పలువురు ఉన్నతస్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుస్తున్నారు.
Japan PM Shigeru Ishiba tweets, “Observed the new ALFA-X train from the window, with an explanation provided by the chairman of JR East.” pic.twitter.com/Czj0dUisPF
— ANI (@ANI) August 30, 2025
ఇక చైనా పర్యటన ముగించుకొని ప్రధాని అట్నుంచి అటు చైనా పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజులపాటు బీజింగ్‌లో పర్యటించనున్న మోదీ.. ఆగస్టు 31న ఆదేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1న తియాన్జిన్లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు హాజరవుతారు. లద్దాఖ్ సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్‌పై విరుచుకుపడుతోన్న వేళ మోదీ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Reached Sendai. Travelled with PM Ishiba to this city on the Shinkansen.@shigeruishiba pic.twitter.com/qBc4bU1Pdt
— Narendra Modi (@narendramodi) August 30, 2025
Also Read..
Punjab Rains: పంజాబ్‌లో వరదలు.. 23 మంది మృతి, వెయ్యి గ్రామాలు మునక
Cardiac Surgeon | హార్ట్ సర్జన్‌కు గుండెపోటు.. హాస్పిటల్లో రౌండ్స్‌లో ఉండగా కుప్పకూలిపోయాడు