చెన్నై: ఆయనో యువ హార్ట్ సర్జన్ (Cardiac Surgeon). విధుల్లో భాగంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హృద్రోగులను పరిశీలిస్తున్నారు. ఇంతలో గుండెపోటు (Heart Attack) రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి వైద్యులు ఎంత ప్రయత్నించిన లాభం లేకుండాపోయింది. ఈ ఘటన చెన్నైలోని ఓ హాస్పిటల్లో చోటుచేసుకున్నది.
39 ఏండ్ల డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ (Dr Gradlin Roy) చెన్నైలోని సవితా మెడికల్ కాలేజీలో కార్డియాక్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. గత బుధవారం విధుల్లో భాగంగా రౌండ్స్ నిర్వహిస్తుండగా కుప్పకూలిపోయాడు. తోటి వైద్యులు అతడిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. సీపీఆర్‌తోపాటు అత్యవసర అంజియోప్లాస్టీ, ఇంట్రా-ఆరోటిక్ బలూన్ పంప్, ఈసీఎంఓ చేసినప్పటికీ వైద్యులు డాక్టర్ గ్రాడ్లిన్ ప్రాణాలను నిలుపలేకపోయారని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ చెప్పారు. 30 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సున్న యువ వైద్యులు ఆకస్మికంగా గుండేపోటు బారినపడటం సాధారణ విషయం కాదన్నారు. పని ఒత్తిడి, సరిగా ఆహారం తినకపోవడం, గంటల తరబడి విధులు నిర్వహించడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు. డాక్టర్లు రోజులో 12 నుంచి 18 గంటలపాటు పనిచేస్తున్నారని, కొన్నిసార్లు ఒకే షిఫ్ట్‌లో 24 గంటల కంటే అధికంగా విధులు నిర్వహించాల్సి వస్తుందని చెప్పారు. దీనివల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా భారీ అంచనాలు, మెడికో లీగల్ కేసులు, చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భాలు కూడా ఒత్తిడికి కారణమవుతున్నాయని తెలిపారు. వీటికితోడు అనారోగ్యకరమైన జీవన విధానం, శారీరక వ్యాయామం లేకపోవడం, తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోకపోవడం కూడా గుండె పోటుకు కారణమవుతున్నాయని చెప్పారు.
Chennai cardiac surgeon, 39, dies of heart attack. Apollo Hyderabad doctor sounds alarm on why doctors are collapsing from heart attacks https://t.co/t3A6wXGs3Q
An important and timely article published in the Economic Times has cited my recent post on this topic.…— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) August 29, 2025