ఇండోర్: ఇది చదవగానే అప్పుడెప్పుడో 2007లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా నటించిన ‘జబ్ వి మెట్’ (Jab We Met)సినిమా గుర్తొచ్చింది కదా. అవును అచ్చం ఆ సినిమా కథ లానే 18 ఏండ్ల తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో (Indore) జరిగింది.
ఇండోర్‌కు చెందిన శ్రద్ధ తివారి అనే 18 ఏండ్ల యువతి.. సార్ధక్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ నెల 23న అతడిని పెండ్లి చేసుకోవడానికి చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రైల్వే స్టేషన్‌కు వస్తానని చెప్పిన యువకుడు.. మొహం చాటేశాడు. అతని కోసం గంటల తరబడి నిరీక్షించిన ఆమె ఎంతకూ రాకపోవడంతో ఫోన్ చేయగా.. నిన్ను పెండ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని బదులిచ్చాడు. దీంతో ఏం చేయాలో తోచక పగిలిన గుండెతో ఆ స్టేషన్‌కు వచ్చిన రైలు ఎక్కేసింది. ఆ రైలు ఎటు పోతుంది, తాను ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు. అయితే కొన్ని తర్వాత రత్నామ్ రైల్వే స్టేషన్లో దిగిపోయింది. తన భవిష్యత్ ఏంటని ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది.
ఈ క్రమంలో తన కాలేజీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న కరణ్‌దీప్.. ఒంటరిగా కూర్చున్న శ్రద్ధను రైల్వే స్టేషన్లో చూశాడు. ఈ సమయంలో ఇక్కడ ఉన్నావేంటి, అసలు ఏం జరిగిందని అడగడంతో జరిగిన సంగతి మొత్తం చెప్పింది. దీంతో తిరిగి ఇంటికి వెళ్లాలని, తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పాలని సూచించాడు. అందుకు ఆమె నిరాకరించింది. నేను పెండ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేశాను. వివాహం చేసుకోకుండా ఇంటికి వెళ్తే నేను బతికి ఉండను అని అనికి తెలిపింది. అయితే ఆమెకు ఎంతగా సర్ది చెప్పాలని చూసినా ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో తనను పెండ్లి చేసుకోవాలని కరణ్‌దీప్ కోరడంతో.. ఒప్పకుంది. అనంతరం ఇద్దరూ కలిసి మహేశ్వర్-మండలేశ్వర్‌కు వెళ్లి పెండ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి మాండ్‌సౌర్‌కు చేరుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని తన తండ్రి అనిల్ తివారీకి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఈ రాత్రికి హోటల్ ఉండాలని, తెల్లారి ఇంటికి వచ్చేయాలని తండ్రి ఆమెకు చెప్పారు. అయితే ఆ జంటకు రూమ్ ఇవ్వడానికి ఏ హోటల్ కూడా ఒప్పుకోకపోవడంతో అనిల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అతడు రైలు టికెట్లు కొనేందుకు కరణ్‌దీప్ అకౌంట్‌కు డబ్బులు పంపాడు. చివరికి ఇండోర్ చేరుకున్న ఆ జంత.. ఎంఐజీ పోలీసును ఆశ్రయించారు.
దీంతో అనిల్ తివారీకి పోలీసులు సమాచారం అందించారు. తన కూతురు ఇంటికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అయితే శ్రద్ధ, కరణ్దీప్లను పది రోజులపాటు దూరంగా ఉంచుతామని, ఆ తర్వాత కూడా అతనితోనే కలిసుంటానని చెబితే వారి వివాహానికి అగీకరింస్తామని చెప్పారు.