Khawaja Asif | పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశం రెండు దేశాలతో యుద్ధానికి సిద్ధంగా ఉందంటూ ప్రకటించారు. తూర్పు సరిహద్దులోని భారత్ (India), పశ్చిమ సరిహద్దులో తాలిబన్లతో (Afghanistan).. రెండు వైపులా యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు.
ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘మేము రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. తూర్పు (భారతదేశం), పశ్చిమ సరిహద్దు (అఫ్ఘానిస్థాన్) దేశాలను రెండింటినీ ఎదుర్కోవడానికి మేము పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. ఈ యుద్ధంలో అల్లా మాకు అన్ని విధాలుగా సాయం చేస్తాడు’ అంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ పేలుడు ఘటన వేళ ఖవాజా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాగా,పాక్‌లో రెండు రోజుల క్రితం ఆత్మాహుతి దాడి ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లోని ఓ కోర్టు ఆవరణలో కారులో బాంబు పేలింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా.. 36 మంది గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి బాంబు దాడికి తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (Tehreek-e-Taliban Pakistan) బాధ్యత వహించింది. అయితే, ఈ దాడి విషయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్‌ను దోషిగా చూపే ప్రయత్నం చేశారు. ఈ దాడి వెనుక న్యూఢిల్లీ మద్దతు గ్రూపుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడు ఉగ్రవాద దాడే : అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో
US Shutdown | అమెరికాలో ముగిసిన షట్‌డౌన్.. ఫండింగ్ బిల్లుపై ట్రంప్ సంతకం