PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈనెల చివర్లో చైనా (China) పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు. అక్కడ టియాంజిన్ (Tianjin)లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో (SCO summit) పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా తొలిరోజు అంటే ఆగస్టు 31న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో (Xi Jinping) మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
కాగా, ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఏడేళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2018లో పర్యటించారు. అనంతరం చైనా (China) అధ్యక్షుడు 2019లో భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత నిరుడు అక్టోబర్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యాక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగింది. నేరుగా విమాన సర్వీసులు, కైలాస్ మానసరోవర్ యాత్రను పునరుద్ధరించేందుకు ఈ సంవత్సరం జూన్‌లో ఇరు దేశాలు అంగీకరించాయి.భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల వేళ మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన దాదాపు 20 మందికిపైగా ప్రపంచ నాయకులకు ఈ ఎస్సీఓ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. సదస్సు సందర్భంగా మోదీతోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెడ్‌కార్పెట్ వేసి స్వయంగా ఆహ్వానించనున్నారట. ఇక చైనా పర్యటనకు ముందు ప్రధాని మోదీ జపాన్ వెళ్లనున్నారు. ఈ నెల 30న జపాన్‌లో పర్యటించిన అనంతరం రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని చైనా వెళ్తారు.
Also Read..
US-India | ఇది మోదీ యుద్ధం.. భారత్ అలా చేస్తే రేపటి నుంచే 25 శాతం సుంకాలు : అమెరికా
Himachal Pradesh | హిమాచల్‌పై ప్రకృతి ప్రకోపం.. 310 మంది మృతి