శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 22:37:14

లెబనాన్ లో మిన్నంటిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు

లెబనాన్ లో మిన్నంటిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు

బీరుట్ : పేలుడు జరిగినప్పటి నుంచి లెబనాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలని ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాని హసన్ డియాబ్ కూడా సోమవారం మధ్యాహ్నం తన రాజీనామాను ప్రకటించారు. 

ప్రజాగ్రహానికి బలికాక ముందే సోమవారం న్యాయ మంత్రి మేరీ క్లాడ్ నజామ్, ఆర్థిక మంత్రి ఘాజీ వాజనీ రాజీనామా చేశారు. అదే సమయంలో పర్యావరణ మంత్రి డామియానోస్ ఖతార్, సమాచార మంత్రి మనల్ అబ్దుల్ సమద్ రాజీనామా లేఖలు ఇచ్చారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైనప్పటికీ.. పేలుడు తర్వాత కూడా ప్రభుత్వం తీవ్రంగా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆదివారం బీరుట్‌లోని పార్లమెంటు సమీపంలో నిరసనకారులు రహదారిని అడ్డుకున్నారు. ఇక్కడి షాహీద్ చౌక్ వద్ద సుమారు 10 వేల మంది గుమిగూడారు. పోలీసులు, నిరసనకారుల మధ్య యుద్ధం లాంటి పరిస్థితి ఏర్పడింది. నిరసనకారులను తొలగించేందుకు పోలీసులు వాటర్ కానన్లు, బాష్ప వాయువు వదిలారు. కొందరు నిరసనకారులు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ బ్యాంకులపై కూడా దాడి చేశారు. ఈ ఘర్షణలో ఒక పోలీసు మృతి చెందగా, 170 మందికి పైగా గాయపడ్డారని రెడ్‌క్రాస్ తెలిపింది. 

ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని అగ్రశ్రేణి క్రిస్టియన్ మెరోనైట్ పాస్టర్ పాట్రియార్క్ బెచెర్ బౌట్రోస్ అల్-రాయ్ మాట్లాడుతూ.. వారు పాలించే విధానాన్ని మార్చలేనందున.. కేబినెట్ మొత్తం రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. ఎంపీ లేదా ఒకరిద్దరు మంత్రులు రాజీనామా చేసినంత మాత్రాన సరిపోదని, ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయాలని సూచించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశాన్ని రక్షించలేకపోతున్నారని చెప్పారు.

ఇలాఉండగా, బీబీసీ నివేదిక ప్రకారం, బీరుట్ పేలుడులో మరణించిన వారి సంఖ్య 200 కి చేరింది. డజన్ల కొద్దీ ఇంకా కనిపించడం లేదు. వీరిలో చాలా మంది విదేశీ కార్మికులు. గాయపడిన వారి సంఖ్య 7,000 కు పెరిగింది. మరిన్ని పేలుళ్లకు అవకాశం ఉండటంతో పేలుడు జరిగిన ఓడరేవు వద్ద సైన్యం తన సహాయక చర్యలను నిలిపివేసింది.


logo