Khawaja Asif | దాయాది పాకిస్థాన్, సౌదీ అరేబియా (Pakistan-Saudi Arabia) మధ్య కీలక రక్షణ ఒప్పందం (Mutual Defence Agreement) కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ (Khawaja Asif) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్ తమపైకి దాడికి వస్తే సౌదీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఖ్వాజాకు ‘భారత్‌తో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు పాక్‌కు సౌదీ అరేబియా దళాలు అండగా నిలుస్తాయా..?’ అని విలేకరు ప్రశ్నించారు. దీనికి ఖ్వాజా స్పందిస్తూ.. ‘కచ్చితంగా.. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని సమాధానమిచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల్లో దేనిపైన అయినా శత్రు దేశం దురాక్రమణకు పాల్పడితే సంయుక్తంగా కలిసి పోరాడతాయని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం ఎలాంటి దురుద్దేశంతో చేసుకున్నది కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు పాక్ అణ్వాయుధాలను సౌదీ కూడా ఉపయోగించుకోవచ్చని ఖ్వాజా ఈ సందర్భంగా తెలిపారు.
దాయాది పాకిస్థాన్, సౌదీ అరేబియా (Pakistan-Saudi Arabia) మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ దేశ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రెండు దేశాల్లో దేనిపైన అయినా దాడి జరిగితే అది ఇద్దరిపైనా జరిగిన దాడిగా భావిస్తారు. అప్పుడు రెండు దేశాలూ దాడి చేసిన దేశంపై పోరాడేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్- భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ ఒప్పందం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ పరస్పర రక్షణ ఒప్పందంలో ఇతర అరబ్ దేశాలు కూడా చేరే అవకాశం లేకపోలేదని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు.
Also Read..
H1-B Visa Fee | అమెజాన్ టు టీసీఎస్.. హెచ్-1బీ వీసాలు ఏ కంపెనీలకు ఎన్నంటే..?
Bomb Threat | పుకెట్ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపులు.. చెన్నైకి దారి మళ్లింపు