H1-B Visa Fee | అమెజాన్ టు టీసీఎస్.. హెచ్-1బీ వీసాలు ఏ కంపెనీలకు ఎన్నంటే..?
H1-B Visa Fee | అమెరికా (America)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
H1-B Visa Fee | అమెరికా (America)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా (H1B Visa Fee) దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ట్రంప్ చర్య భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది.
అంతేకాదు, అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు టెక్ కంపెనీలకు కూడా ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే.. భారత్‌కు చెందిన పలు దిగ్గజ సంస్థలు ఎక్కువగా హెచ్-1బీ వీసాలతోనే అమెరికాలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ వీసాలతోనే భారతీయుల్ని నియమించుకుంటున్నాయి. ఇందులో అమెజాన్ (Amazon) సంస్థ టాప్‌లో ఉంది. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ (TCS) రెండోస్థానంలో నిలిచింది.
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ నాటికి అమెజాన్ దాదాపు 10,044 హెచ్-1బీ వీసాలను ఉపయోగించింది. ఆ తర్వాత టీసీఎస్ 5,505, మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), యాపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951), ఒరాకిల్ (2,092), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (2,347), కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (2,493), వాల్‌మార్ట్ అసోసియేట్స్ (2,390) హెచ్-1బీ వీసాలను దక్కించుకున్నాయి. ఇవే కాకుండా అమెరికాకు చెందిన పలు కంపెనీలు కూడా హెచ్-1బీ వీసాలతో ఎక్కువమంది భారతీయులను నియమించుకుంటున్నాయి. వాటిపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.
Also Read..
Donald Trump | మాకు గొప్ప కార్మికులు అవసరం.. హెచ్-1బీ వీసా వార్షిక రుసుంపై ట్రంప్
Dallas Airport | టెలికాం సర్వీసుల్లో అంతరాయం.. అమెరికాలో 1,800 విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం
H1B Visa Fee | హెచ్-1బీ వీసా దరఖాస్తులపై రుసుమును భారీగా పెంచిన ట్రంప్..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

