Pakistan | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరు (Operation Sindoor)తో పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ దాడి నేపథ్యంలో పాక్ (Pakistan) అప్రమత్తమైంది. ప్రతీకార దాడులకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇండియాపై ప్రతిచర్యకు ఆ దేశ ప్రధాని షెహబా షరీఫ్ ఆర్మీ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆ దేశ మీడియా డాన్ తెలిపింది. దీంతో ఇండియా – పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగబోతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతకుముందు భారత్ దాడుల నేపథ్యంలో ఆర్మీ ఉన్నతాధికారులతో ఆ దేశ ప్రధాని (Pak PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) అత్యవసరంగా భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చించినట్లు తెలిసింది.
మరోవైపు యుద్ధం నెలకొంటే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇప్పటికే భారత్ సన్నద్ధమవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహించి యుద్ధ సన్నద్ధతమైన సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు నేడు దేశవ్యాప్తంగా సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read..
Khawaja Asif: ఉద్రిక్తతలను తగ్గించేందుకు మేం సిద్ధం: పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్
Jaish-e headquarters | భారత్ దాడుల్లో ధ్వంసమైన జైషే ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయం.. VIDEO
Jaish-e chief | ఆపరేషన్ సిందూర్.. జైషే చీఫ్ మసూద్ కుటుంబం హతం