ఇస్లామాబాద్: భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్( Khawaja Asif) తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి నుంచి బయటపడాలని భారత్ ఆశిస్తే, ఆ దిశగా చర్యలు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో పాటు పీవోకే లోని ఉగ్ర స్థావరాలను భారత్ నేలమట్టం చేసిన తర్వాత ఖవాజా స్పందించారు. బ్లూమ్‌బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పాకిస్థాన్ విద్వేషాన్ని ఉసి గొల్పదని, కానీ ఒకవేళ రెచ్చగొడితే మాత్రం బదులిస్తామని ఆయన అన్నారు. భారత్‌పై ఎటువంటి చర్యలు తీసుకోబమని గత రెండు వారాల నుంచి స్పష్టం చేస్తున్నామని , ఒకవేళ తమపై దాడి జరిగితే మాత్రం, ప్రతిస్పందిస్తామని ఆయన అన్నారు. ఒకవేళ ఇండియా వెనుకడుగు వేయాలని భావిస్తే, ప్రస్తుత పరిస్థితిని శాంతింప చేసేందుకు పూర్తిగా ప్రయత్నిస్తామన్నారు. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు నిర్వహించే అంశం గురించి ఆయన స్పందించలేదు.