Khawaja Asif | పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను (Indus water) అడ్డుకునేందుకు ఆ నదిపై భారత్ చేపట్టే ఏ నిర్మాణాన్నైనా పాక్ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సింధు జలాలు పాక్‌కు రాకుండా నదిపై భారత్ డ్యామ్ కడితే ఏం చేస్తారని పశ్నించగా ఈ విధంగా బదులిచ్చారు. ‘ఒకవేళ భారత్ ఆ పనిచేస్తే ఎలాంటి కట్టడాలనైనా పాక్ ధ్వంసం చేస్తుంది’ అని సమాధానమిచ్చారు.
గత నెల 22న పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఇస్లామాబాద్‌పై పలు ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. నీటిని పాక్‌కు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి పైవిధంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ ఏ క్షణమైనా దాడిచేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌పై భారత్ దాడికి పాల్పడితే అందుకు రెట్టింపు స్థాయిలో బదులిస్తామని ఇటీవలే ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం భారత్ రానున్న 24-36 గంటల్లో సైనిక చర్యకి దిగుతుంది. అదే కనుక జరిగితే న్యూఢిల్లీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు’ అని బుధవారం పాక్ రక్షణ మంత్రి ఒక ప్రకటనలో హెచ్చరించారు. భారత దేశం ఉల్లంఘనకు పాల్పడితే, తాము ధీటుగా ప్రతిస్పందిస్తామని అన్నారు. భారత్ చర్యను బట్టి తమ స్పందన ఉంటుందన్నారు.
Also Read..
Pakistan Ships Banned | పాకిస్థాన్ షిప్‌లను నిషేధించిన భారత్.. పోర్టుల్లోకి అనుమతి నిరాకరణ
Pahalgam attack | పాక్‌కు షాక్.. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై భారత్ నిషేధం