Pahalgam attack | పెహల్గామ్ ఉగ్రదాడితో (Pahalgam attack) భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడికి ప్రతీకార చర్యగా ఇస్లామాబాద్‌పై భారత్ ఆంక్షలు కొనసాగిస్తోంది. ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై దౌత్యపరమైన ఆంక్షలు విధించడమే కాకుండా దాయాది దేశాన్ని ఆర్థికపరమైన చక్రవ్యూహంలో బంధించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నుంచి వచ్చే అన్ని దిగుమతులపై నిషేధం విధించింది ఆ దేశానికి షాక్ ఇచ్చింది.
ప్రత్యక్షంగా, పరోక్షంగా పాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్న అన్ని రకాల వస్తువులను భారత్ నిషేధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాక్ నుంచి ఎలాంటి వస్తువులూ ఇక్కడకు దిగుమతి కావడానికి వీల్లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
గత నెల 22న మధ్యాహ్నం జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్గామ్ (Pahalgam)లో గల బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై చర్యలకు దిగింది. ఈ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ.. పాక్‌పై పలు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఇప్పటికే వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, సిమ్లా ఒప్పందం నిలివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్ నటుల సినిమాలు బ్యాన్, పాక్‌కు చెందిన పలువురి సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం వంటి చర్యలు తీసుకుంది. ఇక పాక్ విమానాలకు (Pak airlines) భారత గగనతలం (Airspace) కూడా మూసివేసింది.
Also Read..
Pahalgam Attack | పాక్‌పై ఆర్థిక దిగ్బంధం!
India Pakistan | ఆగని పాక్ కవ్వింపు కాల్పులు.. సమర్థంగా తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ
X Account Blocked | భారత్‌లో పాక్ సమాచార మంత్రి ఎక్స్ ఖాతా బ్లాక్