న్యూఢిల్లీ: సర్ఫేస్ టు సర్ఫేస్ అబ్దలి బాలిస్టిక్ క్షిపణిని(Abdali Ballistic Missile) పాకిస్థాన్ పరీక్షించింది. శనివారం ఆ పరీక్ష జరిగింది. సుమారు 450 కిలోమీటర్ల దూరం ఆ క్షిపణి ప్రయాగించగలదు. పెహల్గామ్ ఉగ్రదాడి ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ సైనిక విన్యాసాలు చేపడుతున్నది. దానిలో భాగంగా క్షిపణి పరీక్ష జరిగినట్లు తెలుస్తోంది. అబ్దలి వెపన్ సిస్టమ్‌ను పాకిస్థాన్ టెస్ట్ చేసింది. ఇండస్ విన్యాసాల్లో భాగంగా ఆ వెపన్ వ్యవస్థను పరీక్షించినట్లు ఇస్లామాబాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
ISPR
Rawalpindi, 3 May 2025 :
Pakistan today conducted a successful training launch of the Abdali Weapon System— a surface-to-surface missile with a range of 450 kilometers as part of Ex INDUS. The launch was aimed at ensuring the operational readiness of troops and validating… pic.twitter.com/ilcyyR1FtU
— Gharidah Farooqi (T.I.) (@GFarooqi) May 3, 2025
యుద్ధ సన్నద్దతలో భాగంగా ఆ క్షిపణి పరీక్షించినట్లు ఐఎస్పీఆర్ పేర్కొన్నది. ఆర్మీ స్ట్రాటజీ ఫోర్సెస్ కమాండ్ ఆ పరీక్షను ప్రత్యక్షంగా వీక్షించింది. క్షిపణి పరీక్ష సక్సెస్ కావడంతో ప్రెసిడెంట్ అసిఫ్ అలీ జర్దారి, ప్రధాని షెహబాజ్ షరీఫ్.. కంగ్రాట్స్ తెలిపారు.