Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో పాకిస్థాన్‌పై కేంద్రం కఠిన చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేసింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
కేంద్రం ప్రకటనపై పాకిస్థాన్ తాజాగా స్పందించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి భారత్ జలయుద్ధానికి పాల్పడుతోందని వ్యాఖ్యానించింది. భారత్ నిర్ణయాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా బయటకు రాలేదని తెలిపింది. సింధూ జలాల్లోని ప్రతి నీటి బొట్టుపై తమకు హక్కు ఉందని వ్యాఖ్యానించింది. ఈ చర్యను చట్టబద్ధంగా సవాల్ చేస్తామని ప్రకటించింది.
మంగళవారం మధ్యాహ్నం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్గామ్ (Pahalgam)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు దిగింది. సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty ) నిలిపివేసింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
Also Read..
Pahalgam Attack | ఉగ్రదాడి కారణంగా పాక్‌తో సింధు జలాల ఒప్పందం రద్దు.. ఇంతకీ ఏంటా ఒప్పందం..?
Indus Waters Treaty: నీటి యుద్ధం మొదలైందా?.. పాకిస్థాన్‌కు జరిగే నష్టం ఏంటి?