Israel – Hamas War | ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం (Israel – Hamas War) మరోసారి తీవ్రమైంది. సోమవారం రాత్రి నుంచి గాజా (Gaza)పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతుండగా.. గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మృతి చెందారు. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో జరిపిన ఈ భీకర దాడుల్లో మృతుల సంఖ్య 300 దాటింది.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ కనీసం 330 మంది మృతిచెందినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది. మరో 150 మందికిపైగా గాయపడినట్లు వెల్లడించింది. జనవరి 19వ తేదీన కుదిరిన కాల్పుల విమరణ ఒప్పందం తర్వాత గాజాలో జరిగిన అతిపెద్ద వైమానిక దాడి ఇదే. గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులకు దిగాయి. సుమారు 20 ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు ఈ అటాక్‌లో పాల్గొన్నాయి. గాజా సిటీ, రఫా, ఖాన్ యూనిస్ ప్రాంతాల్లోని హమాస్ కేంద్రాలను ఆ దాడి ద్వారా టార్గెట్ చేశారు.
Also Read..
Israeli Military: గాజాపై మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయిల్.. 220 మంది పాలస్తీనియన్ల మృతి
White House | గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. అమెరికా రియాక్షన్ ఇదే
PM Modi | ట్రూత్ షోషల్లో చేరిన ప్రధాని మోదీ.. ట్రంప్‌తో ఉన్న పవర్ఫుల్ ఫొటోతో తొలి పోస్టు