White House | గాజా (Gaza) స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ (Israeli Military) దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో కనీసం 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీనిపై హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇజ్రాయెల్ దాడులపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది. గాజాపై దాడికి ముందు ఇజ్రాయెల్ తమను సంప్రదించిందని తెలిపింది. తమకు చెప్పే దాడి చేసినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాను భయపెట్టాలని చూస్తున్న హమాస్ మిలిటెంట్లు, హుతీలు, ఇరాన్‌కు ఇదో హెచ్చరిక అని వైట్‌హౌస్ (White House) మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ వ్యాఖ్యానించారు.
కాగా, జనవరి 19వ తేదీన కుదిరిన కాల్పుల విమరణ ఒప్పందం తర్వాత గాజాలో జరిగిన అతిపెద్ద వైమానిక దాడి ఇదే. గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడిపై హమాస్ మండిపడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడితో బంధీల భవిష్యత్తు ఆంధకారంలోకి వెళ్తుందని హమాస్ పేర్కొన్నది. అయితే మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు హమాస్ ఇంకా ప్రకటించలేదు. ఇజ్రాయిల్ దూకుడును అడ్డుకునేందుకు మధ్యవర్తులు, ఐకరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని హమాస్ కోరినట్లు తెలుస్తోంది.
Also Read..
Israeli Military: గాజాపై మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయిల్.. 220 మంది పాలస్తీనియన్ల మృతి