Sunita Williams | తొమ్మిది నెలలపాటు అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ (Butch Wilmore)తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు భూమికి చేరబోతున్నారు. ఈ క్రమంలో ఐఎస్ఎస్ నుంచి వీరి తిరుగు ప్రయాణం మొదలైంది.
వ్యోమగాములను భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్‌లోకి వ్యోమగాములు చేరుకున్నారు. అనంతరం ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమికి తిరిగి బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. భూమ్మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్లో వ్యోమగాములంతా ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఇక స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ను వీడే అన్‌డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా (NASA) ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
They’re on their way! #Crew9 undocked from the @Space_Station at 1:05am ET (0505 UTC). Reentry and splashdown coverage begins on X, YouTube, and NASA+ at 4:45pm ET (2145 UTC) this evening. pic.twitter.com/W3jcoEdjDG
— NASA (@NASA) March 18, 2025
Also Read..
Sunita Williams | రేపు భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్.. మొదలైన తిరుగుపయణం ప్రక్రియ
Israeli Military: గాజాపై మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయిల్.. 220 మంది పాలస్తీనియన్ల మృతి