Tehran | ఇరాన్ (Iran) అగ్నిగుండంలా మారింది. సుప్రీం లీడర్ ఖమేనీ (Ayatollah Ali Khamenei) వ్యతిరేక నిరసనలతో దేశం అట్టుడుకుతున్నది. రాజకీయ, ఆర్థిక మార్పులు డిమాండు (Iran Protests) చేస్తూ ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటడంతో గురువారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్లు నిలిచిపోయాయి. తాజా ఆందోళనలో దాదాపు వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
తాజా నిరసనల్లో 200 మందికిపైగా మరణించినట్లు ఓ వైద్యుడు వెల్లడించారు. ఈ మరణాలు ఒక్క రాజధాని టెహ్రాన్ Tehran)లోనే చోటు చేసుకున్నట్లు తెలిపారు. టెహ్రాన్‌లోని దాదాపు ఆరు ఆసుపత్రుల్లో 217 మంది నిరసనకారులు మరణించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చంటూ వ్యాఖ్యానించారు. మృతుల్లో ఎక్కువమంది యువకులే ఉన్నట్లు తెలిపారు. ఉత్తర టెహ్రాన్ పోలీస్ స్టేషన్ వెలుపల భద్రతా దళాలు నిరసనకారులపై మెషిన్ గన్లతో కాల్పులు జరపడంతో 40 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారన్నారు.
Also Read..
Donald Trump: రష్యా, చైనా కంటే ముందే.. ఏదో రీతిలో గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్
Trump | ఒక్కొక్కరికి లక్ష డాలర్లు!.. గ్రీన్లాండ్ ప్రజలకు ట్రంప్ పెద్ద ఎత్తున ప్రలోభాలు
మరో చమురు ట్యాంకర్ అమెరికా హస్తగతం