Donald Trump: రష్యా, చైనా కంటే ముందే.. ఏదో రీతిలో గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్
Donald Trump: సైనిక బలంతో గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆర్కిటిక్ దీవిపై గుత్తాధిపత్యం ఉన్నట్లు డెన్మార్క్ చేస్తున్న వాదనలను ట్రంప్ కొట్టిపారేశారు. గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం కోసం ఏదో ఒకటి చేస్తామని, అది వారికి నచ్చినా నచ్చకపోయినా ఇది జరుగుతుందన్నారు.
వాషింగ్టన్: గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు సైనిక బలగాలను వాడనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)మరోసారి పేర్కొన్నారు. ఆర్కిటిక్ దీవిపై గుత్తాధిపత్యం ఉన్నట్లు డెన్మార్క్ చేస్తున్న వాదనలను ట్రంప్ కొట్టిపారేశారు. గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం కోసం ఏదో ఒకటి చేస్తామని, అది వారికి నచ్చినా నచ్చకపోయినా ఇది జరుగుతుందన్నారు. వైట్‌హౌజ్‌లో చమురు కంపెనీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ట్రంప్ పేర్కొన్నారు. గ్రీన్‌ల్యాండ్ గురించి అడిగినప్పుడు ట్రంప్ స్పందిస్తూ.. ఈ అంశంలో డీల్ చేయాలన్న ఆలోచన ఉందని, చాలా ఈజీ పద్ధతిలో అది జరగాలని, ఒకవేళ అలా జరగకుంటే,అప్పుడు కఠిన పద్ధతిలో ఆ డీల్ చేస్తామన్నారు.
ఖనిజ సంపద కలిగిన దీవిలో అమెరికా జాతీయ భద్రత ముఖ్యమని, ఎందుకంటే ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా దేశాలు తన సైనిక కార్యకలాపాలను పెంచుకుంటున్నాయన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను రష్యా, చైనా ఆక్రమించుకోకముందే తాము ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోనున్నట్లు చెప్పారు. గ్రీన్‌ల్యాండ్ గురించి ఏదో ఒకటి చేస్తామని, అయితే మంచిగా లేదంటే విభిన్నంగా వ్యవహరిస్తామన్నారు. వాస్తవానికి గ్రీన్‌ల్యాండ్‌లో ఇప్పటి అమెరికా మిలిటరీ బేస్ ఉన్నది. ఇక ఆ దీవిని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల డెన్మార్క్‌తో పాటు యురోపియన్ దేశాలు షాక్ వ్యక్తం చేశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Donald Trump
- Greenland
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

