Earthquakes | పొరుగుదేశం పాకిస్థాన్‌ను వరుస భూకంపాలు (Earthquakes) వణికిస్తున్నాయి. ఆ దేశంలో అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi)లో 48 గంటల్లో ఏకంగా 20కిపైగా భూ ప్రకంపనలు (20 mild earthquakes) నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి 48 గంటల్లో దాదాపు 21సార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టరు స్కేలుపై 2.1 నుంచి 3.6 మధ్య ఉన్నాయి.
ఆదివారం రాత్రి 3.6 తీవ్రతతో సంభవించిన భూకంపం అత్యంత శక్తివంతమైందిగా అక్కడి అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనల ధాటికి మాలిర్ జిల్లా జైలు గోడ పాక్షికంగా కూలిపోయింది. దీంతో దాదాపు 216 మంది ఖైదీలు పరారయ్యారు. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే వరుసగా స్వల్ప స్థాయిలో భూమి కంపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇది దేనికి సంకేతమో అంటూ ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రమాదకరమైన భూకంపం వచ్చే అవకాశం ఉందేమోనని భయపడుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదంటూ అక్కడి అధికారులు సూచిస్తున్నారు. అయితే, కొన్ని స్వతంత్ర సంస్థలు మాత్రం ప్రమాదం పొంచి ఉందంటూ హెచ్చరిస్తున్నాయి.
మరోవైపు 48 గంటల్లోనే దాదాపు 21 సార్లు భూమి కంపించినప్పటికీ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే, భారతదేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ మాత్రం ఆదివారం నుంచి కరాచీ ప్రాంతంలో ఎలాంటి భూకంప కార్యకలాపాలు నమోదు చేయలేదు. దీంతో పాక్ వ్యవస్థలపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Also Read..
Harsh Goenka | దేశంలో సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా..? తొక్కిసలాట ఘటనపై హర్ష్ గోయెంకా పోస్ట్
Bengaluru Stampede | పోస్టుమార్టం పేరుతో నా బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయకండి.. ఓ తండ్రి ఆవేదన
Stampede | తొక్కిసలాట ఘటన.. సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు