Operation Sindoor | జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వాటిలోని అనేక మంది ముష్కరులను తుదముట్టించింది. వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు (Satellite pics) తాజాగా బయటికొచ్చాయి.
భారత్ దాడుల్లో బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం (Jaish terror camp), మురీద్కేలోని లష్కరే తయ్యిబా ఉగ్ర క్యాంప్‌లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు నలుగురు సహాయకులు, సన్నిహితులు కూడా మరణించినట్లు తెలిసింది. మొత్తంగా భారత్ జరిపిన ఈ దాడిలో 80 మంది వరకూ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతిచర్యగా పాకిస్థాన్ దాడులు చేసే అవకాశం ఉండటంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా పంజాబ్‌లో హై అలర్ట్ ప్రకటించింది. అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేశారు. విమానాశ్రయాలను మూసివేసింది.
#WATCH | Satellite pics from Maxar Technologies show damage caused by Indian missile strikes on Jamia Mosque in Bahawalpur and the city of Muridke, Pakistan, before and after the strike.
(Source: Reuters) pic.twitter.com/6idaYwwjOW
— ANI (@ANI) May 8, 2025
Also Read..
పహల్గాం ముష్కరులనూ మట్టుబెట్టాల్సిందే
Operation Sindoor | శభాష్ ఇండియన్ ఆర్మీ..! ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రశంసల వర్షం..!