న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై బాధిత కుటుంబాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీనికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు సంయుక్తంగా బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని 9 ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో నిర్వహించిన ఈ అనూహ్య దాడిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పహల్గాం బాధిత కుటుంబాలు దీనిని స్వాగతించాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నిజమైన నివాళి లభించిందంటూ సంతోషం వ్యక్తం చేశాయి.