Bangladesh | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ తాజాగా ఉగ్రదాడి ఘటన కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్ వైమానిక స్థావరంపై (Bangladesh air force base) దుండగులు మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
బజార్ జిల్లా (Bazar District)లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కోక్స్ బజార్‌లోని ఆ దేశ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై దుండగులు దాడికి (attack) పాల్పడినట్లు బంగ్లాదేశ్ సాయుధ దళాల పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో 30 ఏళ్ల స్థానిక వ్యాపారి షిహాబ్ కబీర్ ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగినట్లు వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి.
A group of “miscreants” have launched a sudden attack on the Air Force Base near Cox’s Baxar district’s Samiti Para area in Bangladesh. Firing continuing.@republic @ians_india @ANI @PTI_News @AJArabic @FoxNews @WIONews @TimesNow @NetworkItv pic.twitter.com/JYOUitjgoA
— Awan Shikder (@AwanShikder) February 24, 2025
Also Read..
Student | కాలేజ్ ఫీజు కోసం డెలివరీ బాయ్ అవతారమెత్తిన విద్యార్థి.. నెల సంపాదన ఎంతంటే..?
Pope Francis: రోమ్ ఆస్పత్రిలో పోప్ ఫ్రాన్సిస్‌కు కొనసాగుతున్న చికిత్స
Congress Meet | అధికార బీజేపీని ఎలా ఎదుర్కొందాం..? వ్యూహాలకు పదును పెడుతున్న కాంగ్రెస్