Student | పార్ట్ టైమ్ జాబ్స్ (Part time Jobs).. ఒకప్పుడు ఈ సంస్కృతి అమెరికాలోనే వినిపించేది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు అక్కడ యూనివర్సిటీల్లో చదువుకుంటూ.. పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునేవారు. అయితే, ఇప్పుడు మన దేశంలోనూ విద్యార్థులు ఖాళీ సమయాల్లో నచ్చిన ఉద్యోగాన్ని చేసుకుంటున్నారు. అటు చదువుతోపాటూ.. పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు శ్రమిస్తున్నారు. తల్లిదండ్రులకు కొంత మేర భారం తగ్గించేందుకు వారాంతాల్లో ఏదో ఒక పని చేసుకుంటూ కొంత డబ్బు సంపాదించుకుంటున్నారు.
ఇలా 20 ఏళ్ల విద్యార్థి కళాశాల ఫీజు (Pay College Fees) కోసం డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. న్యూ ఢిల్లీలో స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ (Swiggy Delivery Agent)గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా రెడ్డిట్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌ను నిర్వహించాడు. దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థి సమాధానాలిచ్చాడు. తను ఎందుకు పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాను, తన సంపాదన, ఇతర వివరాలను పంచుకున్నాడు.
ఈ సందర్భంగా ఓ నెటిజన్ కిలోమీటర్‌కు సగటు ఆర్డర్ డెలివరీ ధర ఎంత ఉంటుంది..? అని ప్రశ్నించారు. దీనికి అతడు సమాధానమిస్తూ.. ఒక్కో ఆర్డర్‌కు బేస్ ధర రూ.20 అని డెలివరీ భాగస్వామి వివరించాడు. ఒక ఆర్డర్‌పై 1.5 కిలోమీటర్ దూరానికి రూ.25, 3.2 కి.మీ దూరానికి రూ.35 రూపాయలు, 5.5 కిలోమీటర్లకు రూ.65 రూపాయల వరకూ ఉంటుందని తెలిపాడు. ఇది కేవలం ఢిల్లీలో మాత్రమే అని.. వేర్వేరు ప్రదేశాల్లో ధరల్లో కొంత వ్యత్యాసం ఉంటుందని చెప్పాడు. తాను శని, ఆదివారాల్లో మాత్రమే పనిచేస్తానని వివరించాడు. ఈ లెక్కన నెలకు రూ.6 వేల వరకూ సంపాదిస్తున్నట్లు చెప్పాడు. కానీ రోజైంతా పనిచేసే వాళ్లు రోజుకు 1,000 నుంచి రూ.1,500 మధ్య సంపాదిస్తారని వివరించాడు.
ముందుగా పాకెట్ మనీ కోసం పార్ట్‌టైమ్ జాబ్ మొదలు పెట్టినట్లు సదరు విద్యార్థి తెలిపాడు. అయితే తర్వాత అది కాలేజీ ఫీజు చెల్లించేందుకు కూడా ఉపయోగపడుతోందని చెప్పాడు. ప్రస్తుతం తన వయసు 20 ఏళ్లని.. తన వయసు పిల్లలు పార్టీలు చేసుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పుకొచ్చాడు. కానీ తాను మాత్రం తల్లిదండ్రులకు కాస్త భారం తగ్గించేందుకు పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ చదువుకుంటున్నట్లు వివరించాడు.
Also Read..
Marriage | గేదెల కోసం రెండో పెళ్లికి సిద్ధమైన మహిళ.. అత్తమామల ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్
Delhi Assembly | ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు.. నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
PM Modi | ఊబకాయంపై పోరాటం.. వంటనూనె వాడకాన్ని తగ్గించాలన్న ప్రధాని మోదీ