Delhi Assembly | దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా (Rekha Gupta) గత వారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం అయ్యింది. ఇవాళ ఉదయం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకంటే ముందు బీజేపీ ఎమ్మెల్యే అర్విందర్ సింగ్ లవ్లీని ప్రొటెం స్పీకర్ (Protem Speaker)గా ఎన్నుకున్నారు. ఉదయం రాజ్ నివాస్‌లో ఆయన చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులు, కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత లంచ్ విరామం ఉంటుంది. ఆ తర్వాత మధ్యహ్నం 2 గంటలకు సభ మొదలవగానే బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను స్పీకర్‌గా ఎన్నుకోనున్నారు.
#WATCH | Delhi Chief Minister Rekha Gupta takes oath as a Member of the Legislative Assembly of Delhi
(Source: Delhi Assembly) pic.twitter.com/yEHUZOpADV
— ANI (@ANI) February 24, 2025
ఇక సమావేశాల రెండో రోజైన ఫిబ్రవరి 25న అసెంబ్లీలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. మూడో రోజైన ఫిబ్రవరి 27న ఉదయం నుంచి గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుంది. చర్చ ముగిసిన తర్వాత డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తారు.
Delhi cabinet ministers Parvesh Sahib Singh, Ashish Sood, Manjinder Singh Sirsa and Ravinder Indraj Singh, take oath as Members of the Legislative Assembly of Delhi
(Source: Delhi Assembly) pic.twitter.com/vr3nFMJxnS
— ANI (@ANI) February 24, 2025
కాగా ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది. సొంత మెజారిటీతో అధికారం దక్కించుకుంది. అధికార ఆప్ కేవలం 22 స్థానాలు మాత్రమే నెగ్గి ప్రతిపక్షంలో కూర్చుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా మాజీ ముఖ్యమంత్రి, కల్పాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆతిశీని ఆప్ ఎన్నుకుంది. పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు.
Delhi cabinet ministers Kapil Mishra and Pankaj Kumar Singh take oath as Members of the Legislative Assembly of Delhi
(Source: Delhi Assembly) pic.twitter.com/TdSirk5phE
— ANI (@ANI) February 24, 2025
Also Read..
Nizamabad | సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. నిజామాబాద్‌లో ముందస్తు అరెస్టులు
PM Modi | ఊబకాయంపై పోరాటం.. వంటనూనె వాడకాన్ని తగ్గించాలన్న ప్రధాని మోదీ
IIT Baba | భారత్ గెలవదంటూ జోష్యం.. క్షమాపణలు చెప్పిన ఐఐటీ బాబా