Trash balloons | ఉత్తర (North Korea), దక్షిణ కొరియాల మధ్య బెలూన్ వార్ కొనసాగుతోంది. పొరుగున ఉన్న దక్షిణ కొరియా (South Korea)పై ఉత్తర కొరియా వరుసగా ‘చెత్త’ దాడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. పెద్దఎత్తున చెత్త, ఇతర విసర్జకాలతో ఉన్న మూటలతో కూడిన బెలూన్లను (Trash balloons) సరిహద్దు వెంబడి ఎగురవేసి దక్షిణ కొరియా గనగతలంలోకి పంపుతోంది. తాజాగా ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్ ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్ష భవనం ప్రాంగణంలో (presidential compound) పడింది.
ఈ విషయాన్ని దక్షిణ కొరియా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ గురువారం తెలిపింది. అంతర్ కొరియా సరిహద్దు గుండా పంపిన చెత్త బెలూన్ సియోల్‌లోని అధ్యక్ష కార్యాలయం ప్రాంగణంలో పడినట్లు వెల్లడించింది. అయితే, అందులో ప్రమాదకరమైన వస్తువులు, పదార్థాలూ ఏవీ లేవని పేర్కొంది. అధ్యక్షుడు యూన్ సుక్ యెల్, ఆయన సతీమణిని అపహాస్యం చేసేలా అందులో కరపత్రాలు ఉన్నట్లు తెలిపింది. కాగా, కిమ్ ప్రభుత్వం వదిలిన ఈ చెత్త చెబూన్లు అధ్యక్ష కార్యాలయం ప్రాంగణంలో పడటం ఇది రెండోసారి. జులైలో కూడా ఓ చెత్త బెలూన్ అధ్యక్ష కార్యాలయంపై పడిన విషయం తెలిసిందే. అయితే, వాటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని అప్పట్లో దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించి ఆ చెత్తను తొలగించినట్లు వివరించారు.
కిమ్ ‘చెత్త’ దాడి..
దక్షిణ కొరియా (South Korea)పై ఉత్తర కొరియా వరుసగా ‘చెత్త’ దాడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. పెద్దఎత్తున చెత్త, ఇతర విసర్జకాలతో ఉన్న మూటలతో కూడిన బెలూన్లను (Trash balloons) సరిహద్దు వెంబడి ఎగురవేసి దక్షిణ కొరియా గనగతలంలోకి పంపుతోంది. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ పలు మార్లు ఈ బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. ఇప్పటి వరకూ 7 వేలకుపైగా చెత్త బెలూన్లను ఉత్తర కొరియా వదిలినట్లు అంచనా. అయితే, బెలూన్లను వదలడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు దక్షిణ కొరియా దళాలు గుర్తించాయి. ఈ బుడగలకు జీపీఎస్ పరికరాలను అమర్చి పంపిస్తున్నట్లు గుర్తించాయి.
మరోవైపు ఈ బెలూన్లు దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారాయి. వీటి కారణంగా దక్షిణ కొరియాలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రన్ వేలపై బెలూన్లు పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు విమానాశ్రయాలు తరచూ మూతపడుతున్నాయి. ఆ చెత్త బెలూన్ల కారణంగా జూన్ నుంచి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చెందిన రెండు విమానాశ్రయాల్లోని (Seouls airports) రన్‌వేలను మూసివేయాల్సి వచ్చింది. జూన్ 1 నుంచి ఇచియాన్, గింపో ఎయిర్‌పోర్టుల్లో మొత్తం రన్‌వేలను దాదాపు 20 రోజుల్లోనే మూసివేయాల్సి వచ్చిందని దక్షిణ కొరియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read..
Elon Musk: ఓటేస్తే ప్రైజ్‌మనీ.. ఎలన్ మస్క్‌కు న్యాయశాఖ వార్నింగ్
Justin Trudeau | కెనడా ప్రధాని ట్రూడోకు సొంత పార్టీ ఎంపీలు అల్టిమేటం.. రాజీనామా చేయాలంటూ డెడ్‌లైన్
KTR | ఏడో బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల భార్యల ఆందోళన.. సంఘీభావం ప్రకటించిన కేటీఆర్