North Korea | ఉత్తర కొరియా (North Korea)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి (flooding). ఈ వరదలకు వేల మంది నిరాశ్రయులయ్యారు. చైనా సరిహద్దుల్లోని సినాయిజు, ఉయిజు పట్టణాలు తీవ్ర ప్రభావితమయ్యాయి. ఉయిజు కౌంటీలోని సుమారు 4 వేల ఇళ్లు వరదనీటిలో మునిగిపోయినట్లు రాష్ట్ర మీడియా కేసీఎన్ఏ తెలిపింది.
దాదాపు 3 వేల హెక్టార్లలో వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి. రోడ్లు, వంతెనలు ఎక్కడికక్కడ వదర ప్రవాహానికి కొట్టుకుపోయి. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) నేరుగా రంగంలోకి దిగారు. విపత్తు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు స్థానిక మీడియా నివేదించింది. పడవ సాయంతో ముంపు ప్రాంతాల్లో (affected areas) పర్యటించి పరిస్థితి అంచనా వేసినట్లు పేర్కొంది. మరోవైపు వరదల నేపథ్యంలో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.
Also Read..
Ismail Haniyeh | హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ హనియే హత్య.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఘటన..!
Veena George | కారు ప్రమాదానికి గురైన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్.. వయనాడ్ వెళ్తుండగా ఘటన
Double iSmart | మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో రామ్ డబ్బింగ్