Elephant | దక్షిణాఫ్రికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో ఓ మల్టీ మిలియనీర్ (Multi Millionaire) ప్రాణాలు కోల్పోయారు (Trampled To Death By Elephant). ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని గోండ్వానా ప్రైవేట్ గేమ్ రిజర్వ్ (Game Reserve)లో ఈనెల 22న చోటు చేసుకుంది.
ది డైలీ మెయిల్ ప్రకారం.. గోండ్వానా ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌కు సహ యజమాని అయిన 39 ఏళ్ల ఎఫ్‌సీ కాన్నాడీ టూరిస్ట్ లాడ్జ్ వద్ద ఉన్న ఏనుగుల గుంపును పక్కను పంపేందుకు ప్రయత్నించారు. ఏనుగుల గుంపును పక్కకు తోలుతుండగా.. అందులోని ఓ ఏనుగు ఎఫ్‌సీ కాన్నాడీపై దాడి చేసింది. దంతాలతో పొడుస్తూ.. కింద పడేసి కాళ్లతో పలుమార్లు తొక్కింది. సమీపంలోని రేంజర్లు కాన్నాడీని రక్షించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఏనుగు దాడిలో మిలియనీర్ కాన్నాడీ ప్రాణాలు కోల్పోయారు.
ఎఫ్‌సీ కాన్నాడీ ఓ మల్టీ మిలియనీర్. కేలిక్స్ గ్రూప్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా ఆయన నడుపుతున్నారు. కాన్నాడీకి ఏనుగులు, ప్రకృతి పట్ల విపరీతమైన మక్కువ అని సిబ్బంది తెలిపారు. అతను జంతుశాస్త్రం, జంతువులపై అధ్యయనాలు, వాణిజ్యం, మార్కెటింగ్‌లో డిగ్రీలు పొందారు. ఏనుగులంటే ఎఫ్‌సీ కాన్నాడీకి చాలా ఇష్టమని స్థానికులు తెలిపారు. ఆయనని చాలా మిస్ అవుతామని భావోద్వేగానికి గురయ్యారు.
Also Read..
Parliament Session | కొనసాగుతున్న విపక్షాల ఆందోళన.. లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా
Horses Fight | రోడ్డుపై తలపడ్డ రెండు గుర్రాలు.. ఆటోలో ఇరుక్కుపోయి.. షాకింగ్ వీడియో