Passport | ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశంగా సింగపూర్.. భారత్ స్థానం ఎంతంటే..?
Passport | ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన (Worlds Most Powerful) పాస్ పోర్ట్ (Passport) కలిగిన దేశంగా సింగపూర్ (Singapore ) నిలిచింది. గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న జపాన్ (Japan)ను తాజాగా సింగపూర్ వెనక్కి నెట్టి అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశంగా అవతరించింది.
Passport | ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన (Worlds Most Powerful) పాస్ పోర్ట్ (Passport) కలిగిన దేశంగా సింగపూర్ (Singapore ) నిలిచింది. గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న జపాన్ (Japan)ను తాజాగా సింగపూర్ వెనక్కి నెట్టి అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశంగా అవతరించింది. సింగపూర్ పాస్ పోర్ట్ ఉన్న వారు వీసా రహితంగా, వీసా ఆన్ అరైవల్ విధానంలో ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో పర్యటించవచ్చు. అన్ని దేశాల పాస్ పోర్ట్ ల ర్యాంకింగ్స్ కు సంబంధించిన నివేదికను లండన్ కు చెందిన ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ ‘హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్’ (Henley Passport Index) తాజాగా విడుదల చేసింది.
ఆ నివేదిక ప్రకారం.. గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న జపాన్ ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఈ పాస్ పోర్ట్ ద్వారా గతంలో 193 దేశాల్లో పర్యటించే అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుతం 189 దేశాల్లో మాత్రమే పర్యటించొచ్చు. ఇక భారత్ (India) విషయానికి వస్తే.. గత ఏడాదితో పోలిస్తే 5 స్థానాలను మెరుగుపరుచుకుంది. గతంలో 85వ స్థానంలో నిలిచిన భారత్.. ప్రస్తుతం 57 దేశాలకు వీసా రహిత ప్రవేశంతో టోగో, సెనెగల్ తో పాటు సూచీలో 80వ స్థానానికి చేరుకుంది. ఈ దేశాల పాస్ పోర్ట్ తో 57 దేశాల్లో పర్యటించొచ్చు.
ఇక ఈ జాబితాలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ ల ద్వారా 190 దేశాల్లో తిరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, స్వీడన్, లక్సెంబర్గ్ దేశాలు మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ లు కలిగిన వారు 189 దేశాల్లో తిరగొచ్చు. డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్, యూకే నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ లు కలిగిన వారు స్వేచ్ఛగా 188 దేశాలను చుట్టేయొచ్చు.
ఇక బెల్జియం, చెక్ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాలు ఐదో స్థానంలో నిలిచాయి. ఈ పాస్ పోర్ట్ తో మొత్తం 187 దేశాలు తిరిగిరావొచ్చు. ఇక ఆస్ట్రేలియా, హంగారీ, పోలాండ్ ఆరో స్థానంలో ఉన్నాయి. ఈ పాస్ పోర్ట్ తో 186 దేశాల్లో ప్రయాణించే వీలు ఉంది. ఇక కెనడా, గ్రీక్ ఏడో స్థానంలో ఉన్నాయి. ఈ పాస్ పోర్ట్ లతో ప్రపంచంలో 185 దేశాలను చుట్టేయొచ్చు. ఇక అగ్రరాజ్యం అమెరికా, లిథునేవియా మాత్రం 184 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించే వీలుతో ఎనిమిదో స్థానంలో నిలిచాయి.
ఈ జాబితాలో తాలిబన్ల దేశం అఫ్ఘానిస్థాన్ అట్టడుగున ఉంది. ఈ పాస్ పోర్ట్ తో 27 దేశాలకు మాత్రమే సులభంగా చేరుకునే అవకాశం ఉంది. యెమెన్ (99), పాకిస్థాన్ (100), సిరియా (101), ఇరాక్ (102) చివరి స్థానాల్లో నిలిచాయి.
Singapore passport is world's most powerful passport allowing visa free travel to 192 countries
Singapore replaced Japan which had been consistently topping the ranking since last 5 yrs
India ranks at 80th position along with Senegal and Togo with visa free access to 57 countries pic.twitter.com/5rR85zu6VE— Arvind Datta (@datta_arvind) July 19, 2023
Also Read..
Taj Mahal | తాజ్ మహల్ గోడలను తాకిన యమున.. వీడియో
Rohit Sharma | ఇషాన్ ను బర్త్ డే గిఫ్ట్ అడిగిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Viral News | ఆ గ్రామంలో రోజూ ఒకే టైమ్‌కి పవర్ కట్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

