Viral News | ఆ గ్రామంలో రోజూ ఒకే టైమ్‌కి పవర్ కట్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
Viral News | ప్రియుడి (lover)ని రహస్యంగా కలుసుకునేందుకు ఓ ప్రియురాలు (Girlfriend) కొత్త పథకమే వేసింది. పగలు కలిస్తే అందరికీ అనుమానం వస్తుందని భావించి.. రాత్రి పూట కలుసుకునేలా ప్లాన్ చేసింది. అయితే అందుకు ఓ వింత పని తలపెట్టింది.
Viral News | ప్రియుడి (lover)ని రహస్యంగా కలుసుకునేందుకు ఓ ప్రియురాలు (Girlfriend) కొత్త పథకమే వేసింది. పగలు కలిస్తే అందరికీ అనుమానం వస్తుందని భావించి.. రాత్రి పూట కలుసుకునేలా ప్లాన్ చేసింది. అయితే అందుకు ఓ వింత పని తలపెట్టింది. రాత్రి పూట సైతం ఎవరూ చూడకుండా ఊరి మొత్తానికి కరెంట్ కట్ చేసేది. ఈ ఘటన బీహార్ (Bihar) లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
బేతియా (Bettiah) జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకుంటున్నారు. అయితే, ఒకే గ్రామం కావడంతో ఇద్దరూ కలుసుకునేందుకు ఇబ్బందిగా మారింది. పగలు కలిస్తే ఊర్లో జనానికి అనుమానం వస్తుందని భావించిన యువతి, రాత్రి సమయంలో కలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రియుడికి కూడా చెప్పింది. ఇందులో భాగంగానే రాత్రి పూట కూడా ఎవరి కంటా పడకుండా ఉండేందుకు ఓ ప్లాన్ వేసింది. ప్రతి రోజూ రాత్రి పూట ఊరిలో కరెంట్ కట్ చేసేసేది. ప్రియుడిని కలుసుకునే సమయానికి సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసేది. అనంతరం ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయేది.
యువతి చేస్తున్న పని కారణంగా గత కొంతకాలంగా ఇలా గ్రామం మొత్తం అంధకారంగా మారిపోయేది. ఆ సమయంలో రెండు బైక్ లు, కరెంటు మోటార్లు, పలు మేకలు అపహరణకు సైతం గురయ్యాయి. దీంతో ప్రతి రోజూ ఇలా ఎందుకు జరుగుతోందా అని అనుమానం వచ్చిన గ్రామస్థులు ఒక రోజు మాటు వేయడంతో.. చీకట్లో యువతి, యువకుడి ప్రేమ వ్యవహారం బైటపడింది. ప్రేమికులిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం యువకుడికి దేహశుద్ధి చేసి.. యువతిని గ్రామస్థులంతా నిలదీశారు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా వైరల్ గా మారింది. ఘటనపై పోలీసులు జోక్యం చేసుకొని.. కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ జంట పెళ్లి జరిపించారు.
Also read..
Jeevitha Rajasekhar | చిరంజీవిపై విమర్శలు.. జీవిత, రాజశేఖర్‌కు రెండేండ్ల జైలుశిక్ష
KCR Kaanuka Scheme | ‘కేసీఆర్ కానుక’ దరఖాస్తులకు రేపు తుది గడువు
TSRTC | ఆర్టీసీ బస్సులో చిల్లర సమస్యకు చెక్.. టికెట్ కొనుగోలుకు క్యూఆర్ కోడ్ !
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bettiah
- Bihar
- girlfriend
- Lover
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

