TSRTC | ఆర్టీసీ బస్సులో చిల్లర సమస్యకు చెక్.. టికెట్ కొనుగోలుకు క్యూఆర్ కోడ్ !
TSRTC | టీఎస్ఆర్టీసీ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొనే నగదు కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టం తీసుకురానున్నది.
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొనే నగదు కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టం తీసుకురానున్నది.
ఇప్పటికే ఈ అంశంపై ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు కసరత్తు పూర్తి చేశారు. గత ఏడాది చివరలోనే నగదు రహిత టికెట్ కొనుగోలు పద్ధతిని ప్రవేశపెట్టాలని టీఎస్ఆర్టీసీ భావించింది. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల అది అమలు కాలేదు. ప్రయాణికులు టికెట్ కొనుగోలు కోసం క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లిస్తే అవి ఎవరి ఖాతాలో జమ చేయబడతాయి? ఏదైనా కారణం వల్ల డబ్బులు జమకాకపోతే ఆ డబ్బులకు ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది? వంటి ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఈ సమస్యలు అన్నింటికీ పరిష్కారంగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా సిటీ బస్సుల్లో అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఈ విధానం విజయవంతమైతే.. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ నగదు రహిత టికెట్‌ను అందుబాటులోకి తేనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

